ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన సర్కార్.. మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే

  • ఉద్ధవ్ పేరుపై మూడు పార్టీ మధ్య ఏకాభిప్రాయం: శరద్ పవార్

మహా ఉత్కంఠకు తెరపడింది. రోజుకో మలుపు తిరుగుతూ వచ్చిన మహారాష్ట్ర సర్కారు ఏర్పాటు అంశం ఓ కొలిక్కి వచ్చింది. ఎట్టకేలకు కాంగ్రెస్-ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా పదవి చేపట్టబోతున్నారు. శివసేనకు 16, ఎన్సీపీకి 14, కాంగ్రెస్‌కు 12 మంత్రి పదవులు షేర్ చేసుకునేలా ఓ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులపై ఇంకా క్లారిటీ రాలేదని సమాచారం అందింది.

RELATED NEWS:

25 ఏళ్ల స్నేహ బంధం.. వాళ్ల అబద్ధాల వల్లే చెడింది

దాదాపు నెల రోజుల ఉత్కంఠ తర్వాత శుక్రవారం రాత్రి కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన పార్టీలు మూడు ఉమ్మడిగా సమావేశమయ్యాయి. శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే సహా మూడు పార్టీలకు చెందిన కీలక నేతలు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మాట్లాడుతూ ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రిగా చేయాలన్న ప్రతిపాదనపై తాము ఏకాభిప్రాయానికి వచ్చామని చెప్పారు. అన్ని కీలకమైన విషయాలపై చర్చ జరిగిందని, శనివారం కూడా చర్చలు జరుగుతాయని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ను ఎప్పుడు కలుస్తామన్నది కూడా రేపటి (శనివారం) భేటీ తర్వాత చెబుతామన్నారు. మూడు పార్టీల నేతలంతా కలిసి రేపు మీడియాతో మాట్లాడుతారని శివసేన నేతలు చెప్పారు.

MORE NEWS: 

పాక్ కుట్రలు చేస్తోంది.. వాట్సాప్‌లో సెట్టింగ్స్ మార్చుకోండి: ఆర్మీ

కాలిపై కాలేసుకుని కూర్చోవద్దు: అమెరికా డాక్టర్ సలహా

హెలికాప్టర్‌లో కూతురిని అత్తారింటికి పంపిన తండ్రి

Latest Updates