ఇవాళ సాయంత్రం రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఇవాళ(శుక్రవారం)సాయంత్రం రాజ్‌భవన్‌లో ముందస్తు ఉగాది వేడుకలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ దంపతులతో పాటు ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. రాజ్ భవన్ లో పంచాంగ శ్రవణంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రేపు(శనివారం) ఉదయం 10.30గంటలకు రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వికారినామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించనున్నారు.

 

Latest Updates