ఆ తల్లికి 44 మంది సంతానం

Ugandan woman with sets of twins, triplets and quadruplets.. total 44 children

డజను మంది పిల్లలతో సుఖంగా ఉండండంటూ నవ దంపతులను కొందరు పెద్దలు సరదాగా దీవిస్తుంటారు. అమ్మో అంతమందా.. ఒకరిద్దరు చాల్లే అని నవ్వేస్తుంటరు ఆ నవదంపతులు. కానీ, ఉగాండాకు చెందిన మరియం నబతంజి 44 మంది పిల్లలకు జన్మనిచ్చిందంటే నమ్ముతారా. ఒంటిచేత్తో వాళ్ల పోషణను చూస్తోందంటే ఏమంటారు? అయితే ఆమెదంతా కన్నీళ్ల సంసారమే. అవును39 ఏళ్ల మరియంకు 12 ఏళ్ల వయసులోనే 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లయిం ది. మూడు కాన్పుల్లో నలుగురు(క్వాడ్రప్లెట్స్​), నాలుగు కాన్పుల్లో ముగ్గురు (ట్రిప్లెట్స్​), ఆరు కాన్పుల్లో కవలలను కన్నదామె. అంటే 36మంది లెక్క అక్కడే తేలుతోం ది. పెళ్లయిన ఏడాదికే కవలలకు జన్మనిచ్చిం ది. అండాశయాలు (ఓవరీస్) ఉండాల్సిన దాని కంటే పెద్దగా ఉన్నాయని , గర్భనిరోధకాలు వాడొద్దని ఆమెకు డాక్టర్లు చెప్పారు. .పిల్లలను కనాలని చెప్పారట.

దీం తో 23 ఏళ్లు వచ్చేటప్పటికి మరియం 25 మంది పిల్లలకు తల్లైంది. రెం-డున్నరేళ్ల క్రితం ఆరో సెట్ కవలలకు జన్మనిచ్చిం ది.అయితే, కాన్పు లో కొన్ని కాంప్లి కేషన్ల వల్ల ఒక బిడ్డ చనిపోయింది. అప్పుడే భర్త కూడా ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి పిల్లలను ఆమె ఒంటిచేత్తో సాదుతోంది. కన్నీళ్లతోనే తన జీవితం గడిచిపోతోందని, పిల్లల కడుపు నింపేందుకు ఆమె చేయని పనంటూ లేదు. హెయిర్ డ్రెస్సర్ గా పనిచేసింది.ఈవెం ట్లకు డెకరేషన్లు చేసింది. తుక్కు అమ్ముతోం ది. హెర్బల్ మందుల షాపు నడుపుతోంది. అన్ని చేసినా ఆదాయం మాత్రం అరకొరే. ఆమె పెద్ద కొడుకు ఇవాన్​ కిబుకాకు 23 ఏళ్లిప్పుడు. తల్లికి సాయపడడం కోసం చదువు మానేసి చేదోడుగా ఉంటున్నాడు.

Latest Updates