ఈ నెల 15 వరకు దరఖాస్తుల గడువు పొడిగించిన ఎన్టీఏ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ ఏడాదిలో జరగనున్న వివిధ పరీక్షల గడువు తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) పొడిగించింది. యూజీసీ నెట్, సీఎస్​ఐఆర్ నెట్, జేఎన్​యూఈ, ఐసీఏఆర్ ల దరఖాస్తు తేదీల గడువును జూన్ 15 వరకు పొడిగిస్తున్నట్లు సోమవారం తన అధికారికి వెబ్ సైట్​లో ప్రకటించింది. ఆయా పరీక్షల దరఖాస్తు గడువు మే 31తో ముగిసినప్పటికీ, లాక్​డౌన్ కారణంగా దరఖాస్తు చేయలేకపోయిన వారినుద్దేశించి మరికొద్ది రోజులు పొడిగించినట్లు హెచ్చార్డీ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు. వెబ్ సైట్ నుంచి ఈ నెల 15 సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ లో అప్లికేషన్లు చేయవచ్చునని, రాత్రి 11.50 గంటల వరకు అప్లికేషన్ల ఫీజులు చెల్లించవచ్చని ఎన్టీఏ పేర్కొంది.

Latest Updates