ఆ యూనివర్శిటీల్లో చేరొద్దు

ugc-released-fake-universities-list-23-universities-in-8-states

న్యూఢిల్లీ : దేశంలో గుర్తింపులేని 23 యూనివర్శిటీల్లో చేరొద్దని  యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్టూడెంట్స్‌‌ను హెచ్చరించింది.   వీటిలో  ఎక్కువగా ఎనిమిది యూనివర్శిటీలు ఉత్తరప్రదేశ్‌‌లో, ఢిల్లీలో ఏడు, కేరళ, కర్నాటక, మహారాష్ట్ర , పుదుచ్చేరిలో ఒక్కో ఫేక్‌‌ యూనివర్శిటీలు ఉన్నట్టు యూజీసీ సెక్రటరీ రజ్‌‌నీశ్‌‌ జైన్‌‌ చెప్పారు.

ఉత్తర ప్రదేశ్‌లో  గుర్తింపులేని యూనివర్శిటీలు..వారణాశేయ సంస్కృత విశ్వవిదాలయ (వారణాసి), మహిళా గ్రామ విద్యాపీఠ్‌‌ / విశ్వవిద్యాలయ (ప్రయాగ్‌‌రాజ్), గాంధీ హిందీ విద్యాపీఠ్ (వారణాసి),  నేతాజీ సుభాష్‌‌ చంద్రబోస్‌‌ ఓపెన్‌‌ యూనివర్శిటీ ( అలీగఢ్‌‌ ),  నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి (కాన్పూర్) , ఉత్తరప్రదేశ్‌‌ విశ్వవిద్యాలయ (మధుర), మహారాణా ప్రతాప్‌‌ శిక్ష నికేతన్ విశ్వవిద్యాలయ (ప్రతాప్‌‌గఢ్‌‌), ఇంద్రప్రస్థ శిక్ష పరిషత్ (నోయిడా). ఢిల్లీలో  కమర్షియల్ యూనివర్శిటీ లిమిటెడ్, యునైటెడ్‌‌ నేషన్స్‌‌  యూనివర్శిటీ,  ఒకేషనల్  యూనివర్శిటీ, ఏడీఆర్‌‌ -సెంట్రిక్ జురిడికల్ యూనివర్శిటీ, ఇండియన్ ఇన్‌‌ స్టిట్యూషన్‌‌  ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ (స్పిరిట్యువల్‌‌ యూనివర్శిటీ ), విశ్వకర్మ ఓపెన్ యూనివర్శిటీ ఫర్ సెల్ఫ్‌‌ ఎంప్లాయ్‌‌మెంట్‌‌.  వీటితోపాటు

బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్శిటీ ఎడ్యుకేషన్ సొసైటీ (కర్ణాటక), సెయింట్ జాన్స్  యూనివర్శిటీ(కేరళ), రాజా అరబిక్ యూనివర్శిటీ (మహారాష్ట్ర) , శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (పుదుచ్చేరి) కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్ , ఒడిశాల్లో రెండేసి నకిలీ యూనివర్శిటీలు ఉన్నాయి – ఇండియన్ ఇన్‌‌స్టిట్యూట్‌‌  ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, నవభారత్ శిక్ష పరిషత్,  నార్త్ ఒడిశా యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్  అండ్‌‌ టెక్నాలజీ.

Latest Updates