UIDAI హెచ్చరిక: ఆధార్ లేదని సేవలు నిలుపొద్దు

aadhaarఅన్ని సంక్షేమ పథకాలను ఆధార్  తో లింక్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆధార్ లేదని ప్రజలకు  అత్యవసర సేవలు, పథకాలతో పాటు సౌకర్యాలను నిరాకరించవద్దని యునిక్యూ ఐడెండిఫికేషన్ అథార్టీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రభుత్వాలను కోరింది. వివిధ ప్రభుత్వ, పరిపాలనా విభాగాలకు లేఖలు రాసింది. అత్యవసర వైద్యం, స్కూళ్లలో ప్రవేశం, నిరుపేదలకు రేషన్‌ సరుకుల పంపిణీ వంటి వాటిని తిరస్కరించవద్దని అధికారులకు సూచించింది.

ఆధార్‌ లేని కారణంగా ప్రభుత్వ పరంగా అందించే ఎటువంటి లబ్ధినైనా నిరాకరించటానికి వీల్లేదంది. వైద్య సాయం, చికిత్స వంటి అత్యవసర సందర్భాల్లో కూడా ఆధార్‌ లేదని సేవలు నిరాకరిస్తున్నారంటూ వార్తలు రావటంపై తీవ్రంగా స్పందించింది. ఇవే నిజమైతే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అన్ని సేవలను పొందే హక్కు పౌరులకుందనీ.. ఎవరైనా నిరాకరిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని కోరింది.

Posted in Uncategorized

Latest Updates