UIDAI హెచ్చరిక: ప్లాస్టిక్ ఆధార్ తీసుకోవద్దు

indexప్లాస్టిక్ ఆధార్ కార్టులను తీసుకోవద్దని, వాటి వలన ఏటువంటి ఉపమోగం లేదని యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా (UIDAI) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్లాస్టిక్ ఆధార్ కార్డుల వల్ల వ్యక్తిగత వివరాలు చోరీకి గురయ్యే అవకాశముందని యూఐడీఏఐ ప్రతినిధులు తెలిపారు. సాధారణ కాగితంపై డౌన్‌లోడ్ చేసుకున్న ఆధార్‌కార్డు, ఎం-ఆధార్ మాత్రమే చెల్లుబాటు అవుతాయని UIDAI చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అజయ్ భూషణ్‌పాండే తెలిపారు. కొంతమంది షాఫుల యజమానులు రూ.50 నుంచి 300 వరకు చార్జ్ వసూలు చేస్తూ ప్లాస్టిక్ ఆధార్‌కార్డులు ఫ్రింట్ చేసి ఇస్తున్నారని..అటువంటి వారి నుంచి అప్రమత్తంగా ఉండాలని అజయ్ భూషణ్‌పాండే తెలిపారు. అన్ని రకాల అవసరాల కోసం వినియోగదారులు ఖచ్చితంగా సాధారణ పేపర్ ప్రింటెడ్ ఆధార్, ఎం-ఆధార్‌లనే వాడాలని ఆయన అన్నారు. ఎవరైనా ఒకవేల ఆధార్‌కార్డు పోగొట్టుకొని ఉంటే https://eaadhaar.uidai.gov.in కి లాగిన్ అయి ఆధార్‌కార్డును ఉచితంగా పొందవచ్చని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates