ఉజ్జీవన్‌ బ్యాంక్‌ షేర్లు బంపర్ బోణీ

ఎనలిస్టులు ఊహించినట్టు గానే ఉజ్జీవన్​ స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్‌‌ ఐపీఓ గ్రాండ్ సక్సెస్‌ అయింది. ఇష్యూకు 166 రెట్ల సబ్‌‌స్క్రిప్షన్‌ వచ్చింది. అంతేకాదు లిస్టింగ్‌ తొలిరోజే ఇన్వెస్టర్లకు లాభాల పంట పండ ించింది. ఇష్యూప్రైస్‌ రూ.37 కాగా, 57 శాతం ప్రీమియంతో లిస్టయింది. ఒకానొక దశలో ధర 60 శాతం పెరిగినప్పటికీ, చివరికి 50 శాతం లాభంతో రూ.55 వద్ద ముగిసింది. ప్రైమరీ మార్కెట్లో ఈ ఏడాది అతి ఎక్కువగా సబ్‌‌స్క్రిప్షన్‌ సాధించిన ఐపీఓగా రికార్డులకు ఎక్కింది. ఎర్లీ ట్రేడ్‌‌లో కంపెనీ మార్కెట్‌ వాల్యుయేషన్‌ రూ.9,315.12 కోట్లు గా రికార్డయింది. క్వాలిఫైడ్‌‌ ఇన్‌ స్టిట్యూషనల్‌ బయర్స్‌‌ (క్యూఐబీ) ఇష్యూ 111 రెట్ లు, నాన్‌ –ఇన్‌ స్టి ట్యూషనల్‌ ఇన్వెస్టర్స్‌‌ (ఎన్‌ ఐఐ) ఇష్యూ 473 రెట్ లు , రిటైల్‌ ఇన్వెస్టర్ల కేటగిరీ 49 రెట్లు సబ్‌‌స్క్రయిబ్‌‌ అయింది. రూ.750 కోట్లు సేకరించడానికి ఈ సంస్థ పబ్లిక్ ఇష్యూ ప్రకటించింది. ఒక్కో షేరు ప్రైస్‌ బాండ్‌‌ను రూ.36-.37 మధ్య నిర్ణయించారు. అన్ని కేటగిరీల ఇన్వెస్టర్ లు ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌‌ బ్యాంక్‌‌ షేర్లు కొనడానికి ఎగబడ్డారు. ఆఫర్ సైజు 12.39 కోట్ల షేర్లు కాగా, 2,051.5 కోట్ల షేర్లకు బిడ్ లు వచ్చాయి. ఉజ్జీవన్‌ ఫైనాన్షి యల్‌ సర్వీసె స్‌ షేర్‌‌హోల్డర్లకు రూ.75 కోట్ల విలువైన షేర్లు కేటాయించారు. ఒక్కో షేరుకు వీరికి రూ.రెండు చొప్పున డిస్కౌం ట్‌ ఇచ్చారు. ఈ ఐపీఓ తరువాత బ్యాంకులో ఉజ్జీవన్‌ ఫైనాన్స్ వాటా 94.4 శాతం నుంచి 80 శాతానికి తగ్గింది.

కర్ణాటకలో మొదలై…
ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌‌ బ్యాంకు ప్రమోటర్‌‌ ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసె స్‌ లిమిటెడ్‌‌ (యూఎఫ్‌‌ఎస్‌ ఎల్‌ ) 2005లో ఎన్‌ బీఎఫ్‌‌సీ ఆపరేషన్స్‌‌ ప్రారంభించింది. స్మాల్‌ ఫైనాన్స్‌‌ బ్యాంకు ఏర్పాటు కోసం 2015 అక్టోబరులో ఆర్‌‌బీఐ నుంచి లైసెన్సు వచ్చింది. ఫైనల్‌ లైసెన్సు 2016లో మంజూరు కాగా, 2017 నుంచి బ్యాంకు తన ఆపరేషన్స్‌‌ను బెంగళూరు నుంచి మొదలుపెట్ట ింది. సమిత్‌ ఘోష్‌ ఈ బ్యాంకు ఫౌండర్‌‌ కాగా, నితిన్ చగ్‌ ఎండీ, సీఈఓ. సాధారణ బ్యాంకుల నుంచి లోన్లు పొందలేని వారికి అప్పులు ఇస్తుంది. దీనికి 24 రాష్ట్రాల్లో 49 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. ఈ ఏడాది సెప్టెం బరు 30 నాటి లెక్కల ప్రకారం.. బ్యాంకు లోన్‌ బుక్‌‌ విలువ రూ.12,864 కోట్లు కాగా, డిపాజిట్‌ బేస్‌ రూ.10,130 కోట్లు గా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో 10.9 శాతం నికర వడ్డీ మార్జిన్‌ తో రూ.199 కోట్ల లాభం ప్రకటించింది. మిగతా స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంకులతో పోలిస్తే ఉజ్జీవన్‌ బ్యాంకు గ్రాస్‌ ఎన్‌పీఏలు అతితక్కువగా 0.85 శాతమే ఉన్నాయి. 2020 జనవరిలోపు ఎక్స్చేంజీలకు రావాలని ఆర్‌‌బీఐ ఈ సంస్థకు గడువు విధించింది. కార్యకలాపాలు మొదలుపెట్టి న మూడేళ్లలోపు ఐపీఓ ప్రకటించాలని, లైసెన్సు ఇచ్చేటప్పుడే స్పష్టం చేసింది. తదనంతరం కూడా వాటాలను అమ్మేయాలని షరతు విధించింది. స్మాల్‌ ఫైనాన్స్ వ్యాపా రం చేస్తున్న ఇతర బ్యాంకుల షేర్ల విలువలు ఎక్కువ ఉండటం, ఉజ్జీవన్‌ అసెట్‌ క్వాలిటీ, లోన్‌ బుక్‌‌ బాగుండటంతో షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్ లు ఎగబడ్డారు.

ఎనలిస్టులు ఏమంటున్నారంటే..
బ్యాంకు ఫండమెంటల్స్​ బాగున్నాయి కాబట్టి ఉజ్జీవన్‌ షేరును దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌‌మెంట్‌ గా చూడాలని ఎక్కువ మంది ఎనలిస్టులు, బ్రోకర్లు చెబుతున్నారు. కొన్ని షేర్లను అమ్మేసి, మిగతా వాటిని అలాగే ఉంచాలని మరికొందరు సూచిస్తున్నారు. ‘‘బ్యాంకు అడ్వాన్సుల్లో మంచి పెరుగుదల ఉంది. అసెట్‌ క్వాలిటీ మెరుగుపడుతోంది. క్యాపి టల్‌ సరిపడినంత ఉంది. చాలా రాష్ట్రాల్లో బ్రాంచ్‌ లు ఉన్నాయి. అందుకే ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌‌ బ్యాంక్‌‌ షేరును లాంగ్‌ టర్మ్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌ గా చూడాలి’’ అని ఏవీపీ ఈక్విటీ రీసెర్చ్‌‌, ఫండమెంటల్‌ రీసెర్చ్‌‌ (ఇన్వెస్ట్‌‌మెం ట్‌ సర్వీసెస్‌ ) హెడ్‌‌ నరేంద్ర సోలంకీ అన్నారు. రిలయన్స్‌‌ సెక్యూ రిటీస్‌ ఎనలిస్ట్‌‌ మోనా ఖేతన్‌ కూడా ఈ వాదనను సమర్థించారు. షేరు ధర రూ.85 వరకు వచ్చాక అమ్మేయడం మంచిదని రుద్ర షేర్స్‌‌ అండ్‌‌ స్టాక్‌‌ బ్రోకర్స్‌‌ సూచించింది. ఈ షేరును కొనాలనుకునే వాళ్లు ధర కాస్త తగ్గేదాకా ఆగాలని మోనా ఖేతన్‌ అన్నారు. హెమ్‌ సెక్యూ రిటీస్‌ సీనియర్‌‌ ఎనలిస్ట్‌‌ ఆస్థా జైన్‌ కూడా ఇదే మాట అన్నారు. లిస్టింగ్‌ ప్రీమియంతో కొనడం సరికాదని అన్నారు. బ్యాంకు ఫండమెంటల్స్‌‌ బాగున్నాయి కాబట్టి ఏడాదిలోపే షేర్‌‌ ధర రూ.80 దాకా పెరగొచ్చని ప్రశాంత్‌ తాప్సీ అనే ఎనలిస్టు అంచనా వేశారు

Latest Updates