UK కోర్టు దిమ్మతిరిగే ఆర్డర్ : మాల్యా ఆస్తులు స్వాధీనం చేసుకోండి

MALLYAలిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు గట్టి షాక్ తగిలింది.  లండన్ లోని మాల్యా ఇంట్లోని ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చని గురువారం (జూలై-5) తీర్పు ఇచ్చింది యూకే హైకోర్ట్. ఇండియాలో బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన మాల్యా.. లండన్ పారిపోయిన క్రమంలో 13 బ్యాంకులు కేసులు పెట్టిన విషయం తెలిసిందే.

కేసును విచారిస్తున్న సమయంలో.. యూకే హైకోర్ట్ తీర్పు చెప్పింది. ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్, ఆయన ఏజెంట్లు ..యూకేలోని హెర్ట్ ఫోర్డ్ షైర్ లోని మాల్యా ఉంటున్న ఇంట్లోకి వెళ్లొచ్చని అనుమతి ఇచ్చింది హైకోర్ట్. టెవిన్‌ లోని లేడీవాక్, బ్రాంబిల్ లాడ్జ్‌ లలో మాల్యా ఆస్తులు ఉన్నాయి. ఈ ఆదేశాల ప్రకారం ఎన్‌ ఫోర్స్‌మెంట్ ఆఫీర్ అక్కడికి వెళ్లి.. సోదాలు నిర్వహించి, అందులో ఉన్న అన్ని వస్తువులను తమ ఆధీనంలోకి తీసుకునే వీలు కలగనుంది. హైకోర్టు జడ్జి జస్టిస్ బ్రయాన్ జూన్ 26న ఈ ఆదేశాలను జారీ చేశారు. అవసరాన్ని బట్టి హైకోర్టు ఎన్‌ ఫోర్స్‌ మెంట్ ఆఫీసర్ ఎప్పుడైనా మాల్యా ఇంట్లోకి వెళ్లొచ్చని తెలిపింది. అయితే ఈ ఆదేశాలపై అప్పీలుకు వెళ్లే అవకాశం కల్పించాలని కోర్ట్ ఆఫ్ అప్పీల్‌ లో మాల్యా పిటిషన్ దాఖలు చేశాడు.

 

 

 

Posted in Uncategorized

Latest Updates