
లండన్: కరోనా వ్యాక్సిన్‌కు అంగీకారం తెలిపిన తొలి పాశ్చాత్య దేశంగా యూకే నిలిచింది. బయోఎన్‌టెక్ ఎస్ఈతో కలసి ఫైజర్ సంస్థ రూపొందించిన వ్యాక్సిన్‌కు యూకే ఆమోద ముద్ర వేసింది. వచ్చే వారం నుంచి తమ దేశంలోె ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు యూకే ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. వ్యాక్సిన్‌కు ఎమర్జెన్సీ ఆథరైజేషన్ పచ్చ జెండా ఊపింది. ప్రజలను మహమ్మారి బారి నుంచి రక్షించేందుకు వ్యాక్సిన్ పంపిణీని యుద్ధ ప్రాతిపదికన చేపట్టనున్నట్లు యూకే సర్కార్ పేర్కొంది. బ్రిటన్‌లో కరోనా బారిన పడి 60 వేలకు పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు.