యూకేలో 20 వేలు దాటిన కరోనా మరణాలు

  • ఒక్కరోజులోనే 813 మంది బలి

లండన్: ప్రపంచ అగ్ర దేశాల్లో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. బ్రిటన్ లో గడిచిన ఒక్కరోజులోనే అత్యధికంగా 813 చనిపోయారు. దీంతో కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 20 వేలు దాటిందని అక్కడి హెల్త్ డిపార్ట్ మెంట్ ఆదివారం ప్రకటించింది. కరోనాకు ట్రీట్​మెంట్ తీసుకుంటూ చనిపోయిన మొదటి కేసు నుంచి 51 రోజుల్లోనే మృతుల సంఖ్య 20,319 కి చేరుకుంది. ఏప్రిల్ 10 నాటికి కరోనాతో 1,662 మరణాలు మాత్రమే నమోదు కాగా క్వారంటైన్ సెంట్లర్లు, ఆస్పత్రలు, హోం క్వారంటైన్ లో మరణించిన వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఇప్పటివరకు 1,48,000 వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇరవై వేల కరోనా మరణాలు నమోదైన యూఎస్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ తర్వాత ఐదో దేశంగా యూకే నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో మరణించినవారి సంఖ్య 2 లక్షల 3 వేలకు చేరుకుంది. ఇప్పటివరకు 29 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 8లక్షల 17 వేల మంది రికవరీ అయ్యారు.

Latest Updates