చెవిలోని జోరీగా ఈ కరోనా

ప్రపంచ దేశాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న“ కరోనా ” వైరస్ లా కాకుండా ఓ వ్యక్తి పేరు కానీ, ఆ వ్యక్తి ఇంటి పేరు గాని  ఉంటే ఏమవుతుంది. చెవిలో జోరీగా అవుతుంది. ఇప్పుడు అదే సమస్యతో బాధపడుతున్నాడు ఓ వ్యక్తి . ఇంట్లోనుంచి బయటకు రావాలన్నా, ఆఫీస్ కు వెళ్లాలన్నా ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా భయమే.. అందుకే ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు.

యూకేకి చెందిన ఓ వ్యక్తి పేరు జిమ్మీ ఇంటిపేరు కరోనా. ఆ ఇంటిపేరు ఇప్పుడు జిమ్మీకి తలనొప్పులు తెచ్చిపెడుతుంది. కరోనా అనేది  ఓ మహమ్మారి. అయితే జిమ్మీ ఎక్కడికి వెళ్లినా కరోనా జిమ్మీ అని చెబుతున్నాడు. దీంతో ఆ పేరును జోక్ గా తీసుకుంటున్నారు. నిజం చెప్పాలంటూ ఆటపట్టిస్తున్నారు. బయటకు వస్తే మెడలో ఐడీకార్డ్ తగిలించుకొని బయటకు రావాలంటూ హుకుం జారిచేస్తున్నట్లు చెప్పాడు.

మహమ్మారికి ముందు నా ఇంటి పేరు వల్ల నాకు ఎప్పుడూ సమస్య రాలేదు.  కానీ కరోనావైరస్ వ్యాప్తి చెందినప్పటి నుండి  ప్రజలు నాతో స్నేహంగా ఉండేందుకు ఇష్టపడడంలేదు. పైగా నిరాకరిస్తున్నారని వాపోతున్నాడు.  కాబట్టి ఇది నా పేరు అని నిరూపించడానికి నా బ్యాంక్ కార్డు, పాస్‌పోర్ట్ వారికి చూపిస్తాను. ప్రతిచోటా నా పేరు చెప్పడం విచిత్రంగా అనిపిస్తుంది. కరోనా నువ్వే అంటూ ప్రతీ ఒక్కరు హేళన చేయడం బాధగా ఉందన్నాడు కరోనా జిమ్మీ

Latest Updates