కరోనా పంజా.. ఇంగ్లండ్​లో మళ్లీ లాక్​డౌన్

  • ప్రధాని బోరిస్ ప్రకటన.. ఇంకో ఆప్షన్ లేదని వెల్లడి
  • ఈ నెల 5 నుంచి డిసెంబర్ 2 వరకు అమలు
  • ఆస్ట్రియాలోనూ నవంబర్ చివరి వరకు లాక్​డౌన్​

లండన్: యూరప్ దేశాల్లో కరోనా కేసులు మళ్లీ ఎక్కువవుతున్నాయి. వేలల్లో కేసులు, వందల్లో జనాలు చనిపోతున్నారు. దీంతో ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ లాక్​డౌన్ ప్రకటించగా ఇప్పుడు ఇంగ్లండ్​లోనూ లాక్ డౌన్ అమలు చేయనున్నట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. ఈ నెల 5 నుంచి డిసెంబర్ 2 వరకు 4 వారాలు దేశంలో లాక్​డౌన్ విధిస్తున్నట్టు తెలిపారు. ‘చర్యలు తీసుకోవాల్సిన టైమిది. వేరే ఆప్షన్​లేదు. వైరస్​ వేగంగా వ్యాపిస్తోంది’ అని ప్రధాని చెప్పారు. తాజా ‘స్టే @ హోమ్’ రూల్స్​వెల్లడించారు.​ ఉద్యోగులు, వ్యాపారులకు ఇస్తున్న ఫైనాన్షియల్ సపోర్ట్​ను పొడిగిస్తామన్నారు. రూల్స్  పాటిస్తే క్రిస్​మస్​ నాటికి పరిస్థితి చక్కబడొచ్చని అన్నారు. లాక్​డౌన్ రూల్స్ ప్రకారం.. పబ్స్, రెస్టారెంట్లు సహా నాన్​ ఎమర్జెన్సీ షాపులు తెరవొద్దు. నిత్యావసర, అత్యవరసర షాపులకు మినహాయింపు ఉంది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు తెరిచే ఉంటాయి.

రోజుకు 20 వేలకు పైగా కేసులు

లాక్​డౌన్ విధిస్తున్నట్టు బోరిస్​ ప్రకటించిన రోజే ఇంగ్లండ్​లో 22 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. పది రోజులుగా 20 వేలకు పైగానే రికార్డవుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసులు 10 లక్షలు దాటాయి. 46 వేల మందికిపైగా చనిపోయారు. కరోనా కేసులు, మరణాలు ఇంతకుముందు కన్నా ఎక్కువగా పెరుగుతున్నాయని.. హాస్పిటళ్లలో చేరుతున్న వాళ్ల సంఖ్య ఎక్కువవుతోందని సైంటిఫిక్ అడ్వైజర్లు హెచ్చరించారు. డిసెంబర్ నాటికి వెంటిలేటర్లు, బెడ్ల కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు.

ఆస్ట్రియాలోనూ లాక్​డౌన్

జర్మనీకి ఆనుకొని ఉన్న ఆస్ట్రియాలోనూ రెండో లాక్​డౌన్ ప్రకటించారు. మంగళవారం నుంచి నవంబర్ చివరి వరకు ఆదేశాలు అమల్లో ఉంటా యని ఆ దేశ చాన్సలర్ సెబాస్టియన్ వెల్లడించారు. రెస్టారెంట్లు, కెఫేల్లో టేక్​ అవేలకు అనుమతిచ్చారు. స్కూళ్లు, హెయిర్​ డ్రెస్సర్లు, నాన్ ఎసెన్షియల్ షాపుల ఓపెన్​ చేసుకోవచ్చన్నారు. జిమ్స్, థియేటర్లు క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

Latest Updates