ఆవులు గుడ్లు పెడతాయ్..!

uk-primary-school-kids-think-cows-lay-eggs-says-survey

గుడ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇదేం పిచ్చి ప్రశ్న.. చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు కదా.. కోడి గుడ్డు పెడుతుందని అనుకుంటున్నారా! అయితే బ్రిటన్​లో పిల్లలను ఇదే ప్రశ్న అడిగితే వారు చెప్పిన సమాధానం ఆవులు గుడ్లు పెడతాయని. అవును బ్రిటన్​లోని ప్రైమరీ స్కూల్​పిల్లలు ఇలాగే అనుకుంటున్నారట. ఇదే విషయం ఓ లేటెస్ట్​ సర్వేలో వెల్లడైంది. స్టూడెంట్ల పేరెంట్స్​కు, టీచర్స్​కు కూడా దిమ్మ తిరిగే రిజల్ట్స్ వచ్చాయట ఈ సర్వేలో. బ్రిటన్​ ప్రైమరీ స్కూల్స్​లో చదువుతున్న ప్రతి ముగ్గురిలోనూ ఒకరు ఆవులు గుడ్లు పెడతాయని అనుకుంటున్నారని సర్వేలో చెప్పినట్టు మెయిల్​ ఆన్​లైన్​ వెల్లడించింది.

ఇక 6 నుంచి 11 ఏళ్ల వయసున్న స్టూడెంట్లలో ప్రతి పది మందిలోనూ ముగ్గురికి ట్యూనా అనేది చేప నుంచి వస్తుందని తెలియదట. ఇక పదో వంతు మంది తాము అసలు చెర్రీ టమాటాను టేస్ట్​ చేయలేదని చెప్పారట. ఒక చారిటీ సంస్థ, ఓ కిచెన్​ అప్లయన్స్​ కంపెనీ కలిసి ఈ సర్వే చేశాయి. దాదాపు 1000 మంది ప్రైమరీ స్టూడెంట్ల నుంచి శాంపిల్స్​ సేకరించారు. ఇందులో వెల్లడైన విషయాలతో ఎక్స్​పర్ట్స్​ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము తినే తిండి ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియని స్థితిలో స్టూడెంట్లు ఉన్నారని, యూకే చిన్నారుల్లో కనీస నాలెడ్జ్​ కూడా లేదని పేర్కొన్నారు. సరైన వయసులో స్టూడెంట్లకు అవసరమైన నాలెడ్జ్​ అందజేయకపోవడమే దీనికి కారణమని అంటున్నారు. గతంలో బ్రిటన్​ న్యూట్రిషన్​ ఫౌండేషన్​ చేసిన సర్వేలోనూ ఇలాంటి సమాధానాలే వచ్చాయి. మొత్తం 27,500 మంది చిన్నారులను ప్రశ్నిస్తే.. ప్రతి ముగ్గురిలోనూ ఒకరు చెట్ల నుంచి చీజ్​ వస్తుందని, టమాటాలు భూమి లోపల పండుతాయని జవాబిచ్చారు.

Latest Updates