పనిమనిషికి ఇంత జీతమా : ఇలా అయితే గడ్డివాములో గుండుపిన్ను వెతుక్కున్నట్లే

ఒక పనిమనిషి కావాలి. జీతం ఊహించనంత. సంవత్సరానికి 33 సెలవులు ఇస్తామంటూ ఓ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ప్రకటనపై అందరూ నోరెళ్ల బెడుతున్నారు. అందుకు కారణంగా పనిమనిషికి ఇచ్చే జీతం. నెలకు అక్షరాల ప్రారంభ వేతనం రూ.18.5లక్షలు.

బ్రిటన్ రాజకుంటుంబానికి చెందిన విండసర్ క్యాస్టిల్ లో పనిచేసేందుకు హౌస్ కీపింగ్ స్టాఫ్ కావాలంటూ సదరు అఫీషియల్ వెబ్ సైట్ నుంచి ప్రకటన ఇచ్చారు. అప్పటి నుంచి ఆ పనిమనిషి కోసం.., రాయల్ ఫ్యామిలీ కి పనిచేస్తున్న రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ సిల్వర్ స్వాన్ వెతుకుతున్నారు. పనిమనిషి అంటే ఆషామాషీ కాదు సదరు రాజకుటుంబానికి తగ్గట్లుగా బాషలతో పాటు 13నెలల ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ తరువాత సదరు ఉద్యోగిని విధుల్లోకి తీసుకుంటారు. బ్రిటన్ రాజప్రసాదానికి తగ్గ పనిమనిషిని వెతకడం అంటే గడ్డి వాములో గుండుపిన్ను కోసం వెతకడం లాంటిదేనని రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ సిల్వర్ స్వాన్  అన్నారు.

Latest Updates