కరోనాతో సోషల్ మీడియా స్టార్ మృతి.. బెడ్ మీద నుంచి అభిమానులకు చివరి సందేశం

కరోనా బారినపడి ఉక్రేనియన్ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ మరియు సోషల్ మీడియా స్టార్ దిమిత్రి స్టుజుక్ (33)కన్నుమూశారు. ఆయన టర్కీ పర్యటనలో ఉండగా.. కరోనా బారినపడ్డారు. ఆయన ఉక్రెయిన్‌కు రాగానే.. ఎయిర్‌పోర్టు అధికారులు పరీక్షలు చేసి ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేల్చారు. దాంతో ఆయన ఆస్పత్రిలో చేరి 8 రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయన డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు. కానీ కొన్ని రోజులకే ఆయనకు గుండె సంబంధ సమస్యలు వచ్చాయి. ఉన్నట్టుండి అపస్మారక స్థితిలోకి వెళ్లిన దిమిత్రిని.. ఆయన భార్య సోఫియా ఆస్పత్రికి తరలించింది. అక్కడ ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ప్రాణాలొదిలారు.

భర్త మరణం గురించి స్పందిస్తూ సోఫియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘నా భర్త గుండె సమస్యతో ఆస్పత్రిలో చేరాడు. ఆ సమస్యలను ఎదుర్కొవడం ఆయనకు కష్టంగానే ఉంది. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. దిమిత్రి బతకడానికి నేను చేయగలిగినదంతా చేశాను. ఆయన మరణంతో ముగ్గురు అందమైన పిల్లలు మరియు విలువైన అనుభవం మాత్రమే మిగిలాయి’ అని పోస్టులో తెలిపింది.

రెండవ సారి ఆస్పత్రిలో చేరిన తర్వాత దిమిత్రి హాస్పిటల్ బెడ్ నుండి తన ఫాలోవర్లను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ‘నేను ఎలా జబ్బు పడ్డానో పంచుకోవాలనుకుంటున్నాను మరియు ప్రతి ఒక్కరినీ గట్టిగా హెచ్చరించాలనుకుంటున్నాను. నేను అనారోగ్యానికి గురయ్యే వరకూ కోవిడ్ ఉనికిలో లేదని అనుకున్నాను. కోవిడ్ -19 షార్ట్-లైవ్డ్ డిసీజ్ కాదు! ఇది చాలాకాలం ఉంటుంది’ అని దిమిత్రి పోస్ట్ చేశారు.

For More News..

డిప్యూటీ సీఎం ఫోన్ నుంచి షేర్ అయిన పోర్న్ క్లిప్

రాష్ట్రంలో మరో 1,486 కరోనా కేసులు

దసరాకు 3 వేల స్పెషల్​ బస్సులు.. 50 శాతం చార్జీల పెంపు

Latest Updates