అయోధ్య టెంపుల్ భూమి పూజ.. అద్వానీ,జోషీలకు అందని ఆహ్వానం

ఢిల్లీ:  బీజేపీ సీనియర నేత ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీలకు మరోసారి అవమానం జరిగింది. యూపీలోని అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఆగస్టు 5న భూమి జరగనుంది. అయితే కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. బాబ్రీ కేసులో కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీ సీనియర్ నేతలైన అద్వానీ, జోషీలను ఆహ్వానించలేదు. కానీ ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నేత ఉమాభారతిని ఆహ్వానించారు.

రామ మంది నిర్మాణా భూమి పూజకు ప్రధాని మోడీ హాజరవుతారని ఆమె అన్నారు.బాబ్రీ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందో తనకు పట్టింపు లేదని..ఒక వేళ కోర్టు తనను ఉరి తీసినా పర్వాలేదని ఇటీవలే ఉమాభారతి అన్నారు. న్యాయస్థానం తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకుందన్నారు.  ఎల్ కే అద్వానీ గతవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లక్నోలోని ప్రత్యేక సిబిఐ కోర్టు ముందు హాజరయ్యారు. నాలుగున్నర గంటలలో 1000 కంటే ఎక్కువ ప్రశ్నలు ఆయనను అడిగారు, అతనిపై అన్ని ఆరోపణలను ఖండించారు అని అతని న్యాయవాది చెప్పారు. ఇదే కోర్టు ముందు తన స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన మరో సీనియర్ పార్టీ నేత మురళీ మనోహర్ జోషికి కూడా ఆహ్వానం పంపలేదు. తనపై ఆరోపణలు చేసిన వారు రాజకీయ కారణాలతోనే అలా చేశారని, తనపై వచ్చిన ఆరోపణలు అన్నీ అసత్యమని ఆయన అన్నారు.

Latest Updates