కోహ్లీ , ధోనీలను చూసి బుద్ధి తెచ్చుకో.. ఉమర్‌ అక్మల్‌కు అన్న కమ్రాన్‌ సూచన

న్యూఢిల్లీ: క్రికెట్ ఫీల్డ్ లో  ఎలా ఉండాలో, బయట ఎలా ప్రవర్తించాలో సచిన్, ధోనీ, కోహ్లీని చూసి నేర్చుకోవాలని పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ కు అతని అన్న, టీమ్‌మేట్ కమ్రాన్ అక్మల్ సూచించాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ కు  ముందు మ్యాచ్ ఫిక్సర్లు తనని సంప్రదించిన విషయాన్ని దాచిపెట్టిన ఉమర్ పై పాక్ బోర్డు మూడేళ్లబ్యాన్ విధించింది. ‘ఉమర్కు నేనిచ్చే సలహా ఒక్కటే. నిజంగా తప్పు చేసి ఉంటే దానిని నుంచి పాఠం నేర్చుకోవాలి. జీవితమన్నాక చాలా ఆటంకాలు ఎదురవుతాయి. సచిన్, ధోనీ, కోహ్లీ లాంటి వాళ్లను స్ఫూర్తిగా తీసుకోవాలి. కోహ్లీని తీసుకుంటే ఐపీఎల్ ప్రారంభంలో ఒకలా ఉండేవాడు. ఆ తర్వాత చాలా మారిపోయా డు. వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ స్థాయికి ఎదిగాడు. ధోనీ జట్టును నడిపించిన తీరు చూసి చాలా నేర్చుకోవచ్చు. వాళ్లని ఉదాహరణగా తీసుకుని ఆ బాటలోనే మనమూ నడవాలి’ అని సూచించాడు.

Latest Updates