ఉమేశ్ సిక్స్ లకు కోహ్లీ చిందులు

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో   ఉమేశ్ యాదవ్ సిక్స్ లతో విరుచుకుపడ్డాడు. లిండే బౌలింగ్ లో ఐదు సిక్సులు బాదాడు.  మొత్తం 10 బంతుల్లో 31 రన్స్ చేశాడు. ఉమేశ్ సిక్స్ లను డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న వీరాట్ కొహ్లీ తెగ ఎంజాయ్ చేశాడు. ఉమేశ్ సిక్స్ లు బాదుతున్న కొద్దీ కోహ్లీ చిందులేస్తూ, నవ్వూతూ చప్పట్లు కొట్టాడు. ఈ వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది. 497/9 వద్ద టీమిండియా రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఇక ఓవర్ నైట్ స్కోర్ 9/2 వికెట్లతో మూడో రోజు ఆట మొదలు పెట్టిన సఫారీలు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరుతున్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 36 ఓవర్లకే 129 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది.

Latest Updates