చంద్రబాబూ.. ప్రజల వివక్షత గురించి తక్కువ అంచనా వేయకు

అమరావతి: తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపి ప్రతిపక్ష నేత చంద్రబాబు గురించి ప్రస్తావించారు. పాలిచ్చే ఆవు కాకుండా… దున్నపోతని తెచ్చారని చంద్రబాబు అనడం సరికాదన్నారు. ఆయన భాష సంస్కారవంతంగా లేదన్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రజలకు ఇచ్చింది పాలు కాదు, ప్రజల నోట్లో మట్టి కొట్టాడని ఆయన అన్నారు. ప్రజల వివక్షతని తక్కువ అంచనా వెయ్యొద్దని హెచ్చరించారు.

ఆవు ఎవరో… దున్న ఎవరో ప్రజలకు తెలుసని, ప్రజల్ని మోసం చేశావ్ కనుకే గట్టిగా బుద్ది చెప్పారని ఉమ్మారెడ్డి అన్నారు. చంద్రబాబు మొహంలో ఎప్పుడూ నవ్వు ఉండదు కాబట్టే ఆయన్ను చీకటి చంద్రుడు అని అంటారన్నారు. సీఎం జగన్ మొండిగానే ఉంటారని, ఇచ్చిన హామీలు అమలు చెయ్యడంలో జగన్ మొండే నని అన్నారు.  ప్రజలకు మంచి చెయ్యాలనే దృఢమైన సంకల్పం ఉన్న వ్యక్తి సీఎం వై ఎస్ జగన్.

Latest Updates