తిక్కరేగి డోర్ ఇరక్కొట్టాడు..వివాదంలో అంపైర్ లాంగ్

న్యూఢిల్లీ: ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన అంపైర్‌ నిగెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంగ్‌ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వివాదంలో ఇరుక్కున్నాడు. శనివారం బెంగళూరులో జరిగిన రాయల్స్‌ చాలెంజర్స్‌ , సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ సందర్భంగా విరాట్‌ కోహ్లీతో మాటల యుద్ధానికి దిగిన లాంగ్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఈ మ్యాచ్‌ లో సరైన బంతిని నో బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడాన్నికోహ్లీ ప్రశ్నించగా.. నిగెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అతనితో వాగ్వాదానికి దిగాడు. ఇన్నింగ్స్‌ బ్రేక్‌ సమయంలో అంపైర్‌ రూమ్‌ తలుపుపై తన కోపాన్ని చూపించి దాన్ని ధ్వంసం చేశాడు. దీనిపై కర్ణాటక క్రికెట్‌సంఘం.. బీసీసీఐ అడ్మినిస్ట్రేటర్ల కమిటీ (సీఓఏ)కుఫిర్యాదు చేసింది. ఆటగాళ్లు తప్పు చేస్తే శిక్షించినట్టు గానే అంపైర్‌ పై కూడా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వస్తున్నాయి. దీంతో, నిగెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవహారంపై బీసీసీఐ స్పందించే అవకాశం ఉంది. అయితే, ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో మాత్రం అతడిని కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

 

 

Latest Updates