ఐసీసీ ఎలైట్ ప్యానెల్ లో నితిన్ మీనన్

దుబాయ్: ఇండియాకు చెందిన అంపైర్ నితిన్ మీనన్ .. ఇంటర్నేషనల్ ఎలైట్ ప్యానెల్లో చోటు సంపాదించాడు. దీంతో ఈ ఫీట్ సాధించిన యంగెస్ట్ అంపైర్ గా రికార్డులకెక్కాడు. 2020–21 సీజన్ లో నీజెల్ లాం గ్ (ఇంగ్లండ్) స్థానంలో నితిన్ బాధ్యతలు చేపడతాడు. 3 టెస్ట్​లు, 24 వన్డేలు, 16 టీ20ల్లో అంపైరింగ్ నిర్వహించిన 36 ఏళ్ల నితిన్ .. ఇండియా తరఫున ఎలైట్ ప్యానెల్లో చోటు సంపాదించిన మూడో వ్యక్తి. గతంలో మాజీ కెప్టెన్ ఎస్ .వెంకట రాఘవన్ , సుందరమ్ రవి ఈ బాధ్యతలను నిర్వర్తించారు. గతేడాది ఈ ఇద్దర్ని తొలగించారు. ‘లీడింగ్ అంపైర్స్, రిఫరీలతో రెగ్యులర్ గా కలిసి పని చేస్తున్నా. నా సే వలకు మెచ్చి ఎలైట్ ప్ యానెల్ లో చోటిచ్చారు. దీంతో నా కల నెరవేరింది. అందరితో కలిసి మరింత మెరుగ్గా పని చేయడంపై దృష్టిపెడతా’ అని నితిన్ వ్యాఖ్యానించాడు.

Latest Updates