ఇండియా సేవలకు సెల్యూట్

  • క్లోరోక్విన్ సప్లయ్ పై యూఎన్ చీఫ్ గుటెర్రస్

న్యూయార్క్ : కరోనా ను అరికట్టేందుకు ప్రపంచానికి మనదేశం అందిస్తున్న సహకారాన్ని యూఎన్ చీఫ్ సెక్రటరీ గుటెర్రస్ ప్రశంసించారు. కరోనా ట్రీట్ మెంట్ కు అవసరమైన క్వోరోక్విన్ మందులను అవసరమైన దేశాలకు భారత్ అందిచటం గొప్పవిషయమన్నారు. సంక్షోభ సమయంలో ఇండియా వ్యవహారిస్తున్న తీరుకు సెల్యూట్ చేస్తున్నానని గుటెర్రస్ శుక్రవారం తెలిపారు. భారత్ మాదిరిగానే ఇతర దేశాలకు సహకరిస్తున్న అన్ని దేశాలను ఆయన మెచ్చుకున్నారు. ” కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొవటానికి ప్రపంచమంతా కలిసి పోరాడాలి. అంటే ఇతర దేశాలకు సహాయపడే అవకాశం ఉన్న దేశాలన్నీ వీలైనంత సహాయం అందించాలి. అలా చేస్తున్న దేశాలకు నా సెల్యూట్ ” అని గుటెర్రస్ అన్నారు. ఈ విషయాన్ని యూఎన్ చీఫ్ ప్రతినిధి స్టీఫెక్ డుజారిక్ తెలిపారు. కరోనా ట్రీట్మెంట్ కు క్లోరోక్విన్ ఎఫెక్టివ్ గా పనిచేస్తోంది. ఈ డ్రగ్ ను న్యూయార్క్ లో 1500 మంది పేషెంట్లపై ప్రయోగించారు. కరోనా నివారణలో క్లోరోక్విన్ అద్భుతంగా పనిచేస్తుందని స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించటంతో ఈ మందుకు డిమాండ్ పెరిగింది. తమకు క్లోరోక్విన్ సప్లయ్ చేయాలంటూ ప్రపంచ దేశాలకు భారత్ ను అభ్యర్థించాయి. దాదాపు 30 దేశాలకు మనదేశం ఈ డ్రగ్ ను సప్లయ్ చేస్తోంది. వాటిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా భారత్ పొరుగు కంట్రీలు భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, మల్దీవులు, మారిషస్, శ్రీలంక, మయన్మార్ లు కూడా ఉన్నాయి.

 

Latest Updates