మోహన్ బాబు ఫామ్ హౌస్ లోకి అక్రమంగా నలుగురు యువకులు

హైదరాబాద్, వెలుగు: పహాడీ షరీఫ్ పీఎస్ పరిధిలోని జల్ పల్లి మంచు టౌన్ షిప్ లో శనివారం కారుతో కొందరు హల్ చల్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మంచు టౌన్ షిప్ లో మోహన్ బాబుకు చెందిన ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ లోకి ఇన్నోవా కారు అనుమతి లేకుండా దూసుకెళ్లిందని సెక్యూరిటీ గార్డ్ మోహన్ బాబుకు సమాచారం ఇచ్చారు. మోహన్ బాబు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సెక్యూరిటి గార్డ్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఏపీ 31 ఏఎన్‌ 0004 ఇన్నోవా కారులో నలుగురు వ్యక్తులు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. సీసీ టీవీల ఫుటేజ్ ఆధారంగా కారు మైలార్ దేవ్ పల్లికి చెందినవారిదిగా గుర్తించారు. దర్యాప్తులో భాగంగా.. ఈ ఘటనకు పాల్పడింది మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గానగర్ ప్రాంతానికి చెందిన నలుగురు యువకులుగా పోలీసులు గుర్తించారు.  ఆ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా 30 సంవత్సరాల లోపు వారే కావడం గమనార్హం.

For More News..

గరీబోళ్ల భూములే దొరికినయా సారూ..

ఆర్టీసీ బస్సులో పానం పోయింది

Latest Updates