బొగ్గు వాడకం నుంచి ఇండియా బయటపడాలి

యూఎన్ సెక్రటరీ జనరల్ గుటెర్రస్ సూచన
న్యూఢిల్లీ: బొగ్గు వాడకం నుంచి ఇండియా అతి త్వరగా బయటపడాలని యూఎన్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెర్రస్ కోరారు. వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా కోల్‌ వినియోగాన్ని ఇండియా మానుకోవాలని సూచించారు. ఈ ఏడాది తర్వాత భారత్‌లో కొత్త కోల్‌ ఫైర్డ్‌ పవర్ స్టేషన్స్ ఏర్పాటు చేయకూడదన్నారు. బొగ్గుకు బదులుగా పునరుత్పాదక వనరులపై దృష్టి సారించాలన్నారు.

వాతావరణ మార్పులపై పోరులో రీనివబుల్ ఎనర్జీ దిశగా ఎంత వేగంగా అడుగులు వేస్తే అంత త్వరగా ఇండియా గ్లోబల్ సూపర్‌‌పవర్‌‌గా అవతరిస్తుందని పేర్కొన్నారు. బొగ్గుపై ఆధారపడటాన్ని కొనసాగించడం ఇండియాకు ఇబ్బందులు తీసుకొస్తుందన్నారు. కోల్ వాడకంతో భారత్‌లోని చాలా నగరాలు మరింత వాతావరణ కాలుష్యానికి గురవుతాయన్నారు. ఈ తరుణంలో బొగ్గుపై పెట్టుబడులు పెడితే అది మరింత మరణాలు, అనారోగ్యానికి దారి తీస్తుందని హెచ్చరించారు.

Latest Updates