బంగారం కొనలేకపోతున్నరు

భారీగా పడిపోతున్న డిమాండ్
మూడేళ్ల కనిష్ట స్ థా యిలకు డ్రాప్
ఈ ఏడాది 8 శాతం
తగ్గే అవకాశం
డబ్ల్ యూజీసీ రిపోర్ట్ వెల్లడి

ముంబై:ఈ ఏడాది ఇండియాలో గోల్డ్ డిమాండ్ మూడేళ్ల కనిష్ట స్థాయిలకు పడిపోయే అవకాశముందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) అంచనావేసింది. ధరలు రికార్డు స్థాయిలకు పెరగడంతో డిమాండ్‌‌‌‌కు గండికొట్టింది. అంతేకాక గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు కూడా పడిపోయాయి. దీంతో ఈ విలువైన మెటల్‌‌‌‌కు డిమాండ్ పడిపోతున్నట్టు డబ్ల్యూజీసీ పేర్కొంది. గతేడాది నుంచి ఈ ఏడాది వరకు గోల్డ్ డిమాండ్ 8 శాతం తగ్గిపోయి 700 టన్నులకు చేరుకోనుందని డబ్ల్యూజీసీ ఇండియన్ ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరమ్ పీఆర్ చెప్పారు. 2016 నుంచి ఇది కనిష్ట స్థాయిలని పేర్కొన్నారు. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో ఇండియాలో గోల్డ్ వినియోగం 123.9 టన్నులకు పడిపోయింది. అంటే గతేడాది ఇదే సమయంతో పోలిస్తే సుమారు మూడోవంతు తగ్గిపోయిందని డబ్ల్యూజీసీ రిపోర్ట్ పేర్కొంది.

17 శాతం పెరిగిన ధరలు…

ఈ ఏడాది ఇప్పటి వరకు గోల్డ్ ధరలు 17 శాతం వరకు పెరిగాయి. గోల్డ్‌‌‌‌కు ప్రపంచంలో రెండో అతిపెద్ద మార్కెట్‌‌‌‌గా ఉన్న ఇండియాలో ధరలు పెరగడం, అమ్మకాలపై దెబ్బకొట్టింది. అయితే డిమాండ్ పడిపోయి, దిగుమతులు తగ్గిపోతుండటం ఒకందుకు బాగానే సాయం చేసినట్టవుతోంది. దేశీయ వాణిజ్య లోటు భారం కాస్త తగ్గడానికి కారణమైంది. రూపాయికి సపోర్టు ఇచ్చింది.  గ్రామీణ ప్రాంతాల్లో సెంటిమెంట్ బలహీనంగా ఉండటంతో పాటు, ధరలు ఎక్కువగా ఉండటం గోల్డ్ డిమాండ్‌‌‌‌పై ప్రభావితం చూపుతున్నట్టు సోమసుందరమ్ తెలిపారు. భారీ వర్షాలతో చాలా పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఇండియా డిమాండ్‌‌‌‌లో రెండొంతులు గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తుందని పేర్కొన్నారు. జువెల్లరీని వారు ట్రెడిషినల్ సంపదగా భావిస్తారని చెప్పారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకున్న కాలంలో ఇండియాలో గత 25 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షపాతం నమోదైంది. అక్టోబర్ నెలలో కూడా ఈ వర్షాలు కొనసాగాయి. ఈ వర్షాలకు పత్తి, సోయాబీన్స్, పప్పుల పంటలు దెబ్బతిన్నాయి.

గోల్డ్‌‌‌‌పై పెరిగిన దిగుమతి సుంకం…

సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో లోకల్ గోల్డ్ ఫ్యూచర్స్‌‌‌‌ 10 గ్రాముల ధర ఆల్‌‌‌‌టైమ్ గరిష్ట స్థాయిలకు ఎగిసి రూ.39,885గా నమోదైంది. ఇప్పటి వరకు ఈ ధరలు 22 శాతం పెరిగాయి. గోల్డ్‌‌‌‌పై దిగుమతి సుంకం కూడా జూలై తొలి వారంలో 10 శాతం నుంచి 12.5 శాతం పెరిగింది. గోల్డ్ డిమాండ్‌‌‌‌కు కీలక క్వార్టర్‌‌‌‌‌‌‌‌ అయిన డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో కూడా డిమాండ్‌‌‌‌ పడిపోయే అవకాశముందని సోమసుందరమ్ చెప్పారు. గతేడాది డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో గోల్డ్ డిమాండ్ 236.5 టన్నులుగా ఉంది. దీపావళి, వెడ్డింగ్ సీజన్ ఉండటంతో సాధారణంగా అయితే డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో గోల్డ్ డిమాండ్ పెరుగుతుంది. ఈ కాలాన్ని బులియన్ కొనుగోళ్లకు పవిత్రంగా భావిస్తారు.

Latest Updates