టూర్ కోసం వెళ్లి మృత్యువాత : ఎండలకు తట్టుకోలేకపోయారు

unbearable-heat-kills-four-board-kerala-express

ఉత్తరాధి రాష్ట్రాల్లో ఎండతీవ్రతకు.. రైళ్లో ప్రయాణిస్తున్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కేరళకు చెందిన 68 మంది.. వారణాసి, ఆగ్రా చూసేందుకు వెళ్లారు. రెండు, మూడు రోజులుగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లో ఎండతీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో.. వారు నీరసించిపోయారు. కేరళ ఎక్స్ ప్రెస్ లో తిరుగుపయనమయ్యారు. రైళ్లో ఎక్కిన కాసేపటికే.. తమకు నీరసంగా ఉందని బంధువులకు చెప్పారు.

అయితే వారు.. ప్రథమచికిత్స చేసి.. హాస్పిటల్ కు తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి సీరియస్ గా ఉండటంతో హాస్పిటల్ కు తరలించారు. మృతదేహాలను.. యూపీలోని ఝాన్సీ స్టేషన్ లో ట్రెయిన్ నుంచి దించేసి.. పోస్ట్ మార్టం కోసం తరలించారు. చనిపోయినవారంతా 69 నుంచి 71 ఏళ్ల వయసు వారే.

Latest Updates