అండర్‌‌-16 టెన్నిస్‌‌ : సెమీస్‌‌లో హైదరాబాదీ ప్లేయర్‌‌  సంజన

అలవోక విజయాలతో జోరు కనబరుస్తున్న హైదరాబాదీ ప్లేయర్‌‌ సిరిమల్ల సంజన.. రమేశ్ దేశాయ్‌‌ మెమోరియల్‌‌ సీసీఐ అండర్‌‌-16 టెన్నిస్‌‌ నేషనల్‌‌ టోర్నీలో సెమీస్‌‌కు చేరింది. గురువారం జరిగిన బాలికల సింగిల్స్‌‌లో టాప్‌‌సీడ్‌‌ సంజన 6-–4, 7-5 తో గుజరాత్‌‌కు చెందిన దియ భరద్వాజ్‌‌పై చెమటోడ్చి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌‌లో ఆద్యంతం స్థాయికితగ్గ ఆటతీరును సంజన  కనబర్చింది. ఇతర క్వార్టర్స్‌‌లో ఏడోసీడ్‌‌ రెన్నె సింగ్లా (హర్యానా) 6–0, 6-2తో విధి జానీ (గుజరాత్‌‌)పై, ఎనిమిదో సీడ్‌‌ పారి సింగ్‌‌ (హర్యానా) 6-1, 6-2తో రేష్మా మరూరి
(కర్ణాటక)పై, నైష యాదవ్‌‌ (కర్ణాటక) 6-3, 6-1తో భూమిక త్రిపాఠి (మహారాష్ట్ర)పై అలవోక విజయాలు సాధించింది.

Latest Updates