అండర్-19 ఉమెన్స్ క్రికెట్ : కశ్వీ వరల్డ్ రికార్డ్

అరుణాచల్ ప్రదేశ్-చండీగఢ్ జట్ల మధ్య జరిగిన పేటీఎం అండర్-19 మహిళల క్రికెట్ మ్యాచ్ లో చండీగఢ్ కెప్టెన్ కశ్వీ గౌతమ్ రికార్డు సృష్టించింది. కేవలం 12 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టింది కశ్వీ.

ఇవాళ(మంగళవారం) స్థానిక KSRM కాలేజీ గ్రౌండ్ లో అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చండీగఢ్‌ 161 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన చండీగఢ్‌ టీమ్‌ 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. కశ్వీ గౌతమ్‌ 49, సిమ్రన్‌ జోహల్‌ 42, మెహుల్‌ 41 రన్స్ చేశారు. తర్వాత బ్యాటింగ్‌ బరిలోకి దిగిన అరుణాచల్‌ప్రదేశ్‌ కేవలం 8.5 ఓవర్లలో 25 రన్స్ కే ఆలౌట్ అయ్యింది. మేఘా శర్మ 10 నాటౌట్‌గా నిలిచారు. మిగతా 8మంది డకౌట్‌ అయ్యారు. కశ్వీ గౌతమ్‌ 4.5 ఓవర్లలో 12 పరుగులిచ్చి మొత్తం 10 వికెట్లు పడగొట్టింది. 29 బంతుల్లో అరుణాచల్‌ప్రదేశ్‌ జట్టును పెవిలియన్‌కు పంపింది.

ఈ విషయాన్ని BCCI తన ట్వట్టర్ లో వీడియోతో సహా పోస్ట్ చేసి కశ్వీని అభినందించింది.

Latest Updates