భారత క్రికెట్ కు మంచిరోజులొచ్చాయి: లక్ష్మణ్

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకోబోతున్న భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కి ఇప్పటికే పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనుండగా.. గంగూలీ ఒక్కడే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఖాయమైంది. ఈ నెల 23న బాధ్యతలు అందుకోవడం లాంఛనం కానుంది. ఈ క్రమంలో సహచర క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ శుభాకాంక్షలు తెలిపాడు. BCCI అధ్యక్షుడిగా దాదా రాకతో భారత క్రికెట్ మరింత ముందుకు వెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని ట్వీట్ చేశాడు. కొత్త బాధ్యతలోనూ గంగూలీ మరింతగా రాణించాలని కోరుకుంటున్నట్టు లక్ష్మణ్  తెలిపాడు.

Latest Updates