కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. ఉస్మానియా డాక్టర్లకు పీపీఈ కిట్లు

హైదరాబాద్, వెలుగు: కరోనా నియంత్రణలో అలుపెరగకుండా పోరాడుతున్న ఉస్మానియా ఆస్పత్రి డాక్టర్లకు కాకా ఫౌండేషన్ 300 పీపీఈ కిట్లు,100 ఫేస్ షీల్డ్ మాస్క్ లను అందజేసింది. ప్రభుత్వం తగినన్ని పీపీఈ కిట్లు పంపిణీ చేయని పరిస్థితుల్లో కరోనా మహమ్మారి నుంచి రక్షణ కోసం మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్​ వెంకట స్వామి ఈ కిట్లు పంపించారు. ఈ సందర్భంగా ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్​ డాక్టర్​ నాగేందర్​ మాట్లాడుతూ.. వివేక్ వెంకటస్వామి ఉస్మానియా మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థి అని గుర్తుచేశారు. వైద్యుల రక్షణకోసం పీపీఈ కిట్లను అందజేయడంపై సంతోషం వ్యక్తంచేశారు. కరోనాపై పోరులో డాక్టర్ల సేవలను గుర్తించి కాకా ఫౌండేషన్  తమకు అండగా నిలవడంపై కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం

నెట్టింట్లో వైరల్ అవుతున్న సన్న పిన్ చార్జర్

Latest Updates