మంత్రివర్గంలో మాదిగలకు తీరని అన్యాయం : మందకృష్ణ

మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు తీరని అన్యాయం చేశారన్నారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. మాదిగలకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళనకు దిగారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మాదిగలు అనేక ఉద్యమాలు చేశారన్నారు. సీఎం కేసీఆర్ మాదిగలను అణచివేస్తున్నారని మండిపడ్డారు. మంత్రివర్గంలో మాదిగలకు అవకాశం ఇవ్వాలని లేకపోతే ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

Latest Updates