స్కూల్ టీచర్లకు యూనిఫామ్స్

వర్గల్ : స్టూడెంట్స్ యూనిఫామ్స్ లో రావడం కామన్. కానీ టీచర్స్ కు కూడా యూనిఫామ్ అమలు చేశారు ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్. సిద్దిపేట జిల్లాలోని వర్గల్ మండలం అనంతగిరిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో టీచర్లు ఇలా యూనిఫామ్ లో వస్తున్నారు. ఈ స్కూల్  ఉపాధ్యాయులు బోధనలో వినూత్న విధానాన్ని కొనసాగిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు.

గతంలో విద్యార్థులు అందరికీ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా రంగురంగుల యూనిఫామ్ అందుబాటులోకి తెచ్చిన ఉపాధ్యాయులు.. ఇప్పుడు తాము కూడా  యూనిఫాం ధరించి పాటలు చెబుతామంటున్నారు. స్పూర్తి వంతంగా బోధన చేపట్టడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రసన్న తెలిపారు. మహిళా టీచర్లు ఒకే కలర్ సారీ, ఉపాధ్యాయులు ఒకే కలర్ ప్యాంట్, షర్టులున్న యూనిఫామ్స్ తో వస్తున్నారు.

Latest Updates