బడ్జెట్‌పై కేంద్ర కేబినెట్ భేటీ

కేంద్ర బడ్జెట్ 2020-21ను ఆమోదించేందుకు కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అంతకు ముందు ఆమె బడ్జెట్ ప్రతులతో రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ , ఆర్థిక శాఖ అధికారుల టీమ్ అంతా రాష్ట్రపతిని కలిశారు.

లారీలో వచ్చిన బడ్జెట్ కాపీలు

పార్లమెంటులో 11 గంటలకు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. పార్లమెంటు సభ్యులకు, సంబంధిత వ్యక్తులకు కాపీలు ఇచ్చేందుకు లారీలో బడ్జెట్ ప్రతులు పార్లమెంటుకు వచ్చాయి. లోపలికి తీసుకెళ్లే ముందు సెక్యూరిటీ చెకింగ్‌లో భాగంగా బడ్జెట్ కాపీల బాక్సులను డాగ్ స్వాడ్‌తో తనిఖీ చేయించారు.

Latest Updates