వన్ నేషన్, వన్ గ్రిడ్ విధానంతో నిరంతర విద్యుత్ సరఫరా.

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు.  ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. దేశ ఆర్థిక వ్యవస్థకు మౌలిక వసతుల ప్రాజెక్టులు జీవనరేఖలన్నారు. తమ ప్రభుత్వ హయాంలో దేశ వృద్ధి రేటు పెంచేందుకు భారీగా మౌలిక వసతులు ప్రాజెక్టులు చేపట్టామని ఆమె తెలిపారు. మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్  తమ విధానమన్నారు.

దేశమంతటా వన్ నేషన్, వన్ గ్రిడ్ విధానంతో నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని ఆమె తెలిపారు. పరిశ్రమలకు అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేస్తామని, నూతన అద్దె చట్టం తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నామని తన ప్రసంగంలో పేర్కొన్నారు. భారతీయ సంస్థలు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తూ, సంపద సృష్టిస్తున్నాయని ఆర్ధిక మంత్రి అన్నారు

Latest Updates