ఆశాజనకంగా కేంద్ర బడ్జెట్

కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా ఉందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ(శనివారం) లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కిషన్ రెడ్డి మాట్లాడారు. అన్ని రంగాలను ప్రోత్సహించేలా ఉందన్నారు. ఏ రాష్ట్రం పైనా కేంద్రానికి చిన్నచూపు లేదన్నారు. అన్నింటికి సమన్యాయం చేసేందుకే కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఖర్చు కేంద్రమే భరిస్తుందన్నారు. నేషనల్ పోలీస్, ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీలు ఏర్పాటు చేస్తామన్నారు కిషన్ రెడ్డి.

Latest Updates