ఢిల్లీలో రేపు పూర్తిస్థాయి కేంద్ర మంత్రివర్గ సమావేశం

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం పూర్తిస్థాయి సమావేశం రేపు జరగనుంది. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం సౌత్ బ్లాక్ లో కేంద్రమంత్రి వర్గ సమావేశం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రమంత్రి వర్గ సమావేశానికి …. కేబినెట్ ర్యాంక్ మంత్రులు హాజరు కానున్నారు.  కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశానికి.. కేంద్రమంత్రులతో పాటు.. సహాయ మంత్రులు హాజరు కానున్నారు. ఈ రెండు సమావేశాలు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరగనున్నాయి.

కొత్త మంత్రిర్గం కొలువుదీరిన తర్వాత మే 31న తొలిసారి కేంద్ర మంత్రివర్గం సమావేశం అయ్యింది. ఆ సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను జూన్ 17 నుంచి.. జులై 26 వరకు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. జూన్ 19న స్పీకర్ ఎన్నిక జరగనుంది. జూన్ 20న లోక్ సభ, రాజ్యసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. జులై 5న కేంద్రబడ్జెట్ ను పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టనుంది. రేపటి మంత్రివర్గ సమావేశాల్లో వీటిపై చర్చించనున్నారు.

Latest Updates