?LIVE UPDATES : బడ్జెట్ 2023–24

?LIVE UPDATES : బడ్జెట్ 2023–24


ముగిసిన బడ్జెట్‌ ప్రసంగం

గంటా 26నిమిషాల పాటు కొనసాగిన బడ్జెట్‌ ప్రసంగం ముగిసింది.

ఆదాయపన్ను పరిమితి రూ.7లక్షలకు పెంపు

రూ.5లక్షల ఆదాయపు పన్ను పరిమితిని రూ.7లక్షలకు పెంపు 

        ఆదాయం                  పన్ను
రూ.3 నుంచి 6 లక్షలు      5శాతం
రూ.6 నుంచి 9 లక్షలు      10శాతం
రూ.9 నుంచి 12 లక్షలు    15శాతం
రూ.12 నుంచి 15 లక్షలు  20 శాతం 
రూ.15 లక్షలు దాటితే       30శాతం 

తగ్గనున్న టీవీ, మొబైల్ ధరలు
టీవీ, మొబైల్, కెమెరాల విడిభాగాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు 
టీవీ ప్యానెళ్లపై కస్టమ్స్ డ్యూటీ 2.5 శాతానికి తగ్గింపు 

నిరుద్యోగుల కోసం కొత్త స్కీమ్ 

పాన్ ఇండియా నేషనల్ అప్రెంటిస్ షిప్ స్కీమ్
మూడేళ్ల పాటు డీబీటీ ద్వారా వారికి సాయం 
యువతలో నైపుణ్యాలు పెంచేలా పీఎం కౌశిల్ వికాస్ యోజన4.0 ప్రారంభం 
 

సీనియర్‌ సిటిజన్స్‌లో పొదుపు పథకంలో భాగంగా డిపాజిట్‌ పరిమితి పెంపు 
ప్రస్తుతం రూ.15లక్షల వరకూ ఉన్న పరిమితిని డబుల్‌ చేసి, రూ.30లక్షలకు పెంపు 

మహిళలు, బాలికల  కోసం కొత్త స్కీమ్‌
మహిళలు, బాలికల  కోసం సమ్మాన్ బచత్ పత్ర అనే కొత్త స్కీమ్‌
2025 వరకు అమల్లోకి

మహిళల కోసం కొత్త స్కీమ్‌

ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్రం కొత్త పథకం 
మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ను ప్రవేశపెట్టింది. 
రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. 
ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకంలో డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. 
గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఈ పథకంలో డిపాజిట్‌ చేయొచ్చు.

7 ప్రధాన​ అంశాలే ఎంజెండా
ఈ బడ్జెట్ల లో  7 అంశాలకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లుగా నిర్మలా సీతారామన్‌  తెలిపారు.

  • చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు
  • మౌలిక సదుపాయాలు, పెట్టుబడలు
  • సామర్థ్యాల వెలికితీత
  • స్వచ్ఛ పర్యావరణ అనుకూల అభివృద్ధి 
  • యవశక్తి
  • విత్త విధానం
  • అర్థిక విధానాన్ని బలపరచడం 

 

నీతి ఆయోగ్ మరో మూడేళ్లపాటు పొడిగింపు 

కాలం చెల్లిన వాహనాల తొలిగింపుకు తక్షణ ప్రాధాన్యం 
కేంద్రప్రభుత్వ వాహనాలు మార్చేందుకు ప్రత్యేక నిధులు
కొత్త వాహనాల కొనుగోలుకు రాష్ట్రాలకు సాయం అందిస్తాం

రైతులకు తీపికబురు
రైతులకు రూ.20లక్షల కోట్లు వ్యవసాయ రుణాలు అందిస్తాం

కొత్తగా ఇల్లు కొనుగోలు, కట్టుకోవాలనుకోవాలనుకునే వారికి కేంద్రం గుడ్‌న్యూస్‌ 
పీఎం ఆవాస్‌ యోజన పథకానికి ఈ సారి బడ్జెట్‌లో నిధులు పెంచింది.
గత బడ్జెట్‌లో పీఎం ఆవాస్‌ యోజనకు 48 వేల కోట్ల రూపాయలు కేటాయించగా.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని 66 శాతం పెంచి రూ.79వేల కోట్లు కేటాయించారు. 
వడ్డీ రేట్లు పెరిగిన వేళ గృహ కొనుగోలుదారులకు ఇది ఊరట కల్పించే అంశం.

 

  • రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు 
  • రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం కోసం 13.7 లక్షల కోట్లు కేటాయింపు 
  • కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్దపీట
  • వ్యవసాయ రుణాలకు రూ.20 లక్షల కోట్లు
  • మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు 
  • 2013,14 తో పోలిస్తే రైల్వేలకు 9 రెట్ల నిధులు

ఏకలవ్య పాఠశాలల్లో భారీ ఎత్తున ఉపాధ్యాయ నియామకాలు

  • దేశంలోని ఏకలవ్య పాఠశాలల్లో భారీ ఎత్తున ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని కేంద్రమంత్రి నిర్మలా తెలిపారు. 
  • స్కూళ్ల ద్వారా రానున్న 3 ఏళ్లలో 38,800 టీచర్ ఉద్యోగాలు
  • 740 ఏకలవ్య పాఠశాలల్లో3.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు

కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు

  • మత్యశాఖకు రూ. 6 వేల కోట్లు 
  • క్లీన్ ప్లాంట్ కార్యక్రమానికి రూ, 2 వేల కోట్లు
  • ఎస్సీ వర్గాలకు రూ. 15 వేల కోట్లు 
  • పీఎం ఆవాస్ యోజన్ పథకానికి రూ.79 వేల కోట్లు 
  • గిరిజనుల అభివృద్ధికి రూ.15 వేల కోట్లు
  • రైల్వేలకు రూ.2.04 లక్షల కోట్లు 

2047 లక్ష్యంగా పథకాలను రూపొందిస్తున్నాం

2047 లక్ష్యంగా పథకాలను రూపొందిస్తున్నామని నిర్మలా సీతారామన్‌  తెలిపారు. సామాజిక భద్రత, డిజిటల్ పేమెంట్లలో చక్కటి వృద్ధి సాధించామని చెప్పారు, 
2014 నుంచి దేశవ్యాప్తంగా 150కు పైగా వైద్యకళాశాలకు అనుమతి ఇచ్చామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌  తెలిపారు.  త్వరలోనే ఐసీఎంఆర్‌ ప్రయోగశాలల విస్తృతిని మరింత పెంచుతామన్నారు. ఫార్మారంగంలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు. వైద్య కళాశాలల్లో మరిన్ని ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ల

 

సప్త రుషుల రీతిలో ఏడు అంశాలకు బడ్జెట్‌ ప్రాధాన్యం :  సీతారామన్  

  • వ్యవసాయం కోసం డిజిటల్‌ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు.
  • వ్యవసాయ రంగానికి రుణ సదుపాయం, మార్కెటింగ్‌ సదుపాయం.
  • వ్యవసాయ స్టార్టప్స్‌కు చేయూత, ప్రత్యేక నిధి ఏర్పాటు.
  • రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు.
  • పత్తిసాగు మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు. పత్తి కోసం ప్రత్యేకంగా మార్కెటింగ్‌ సదుపాయం.
  • ఆత్మ నిర్భర్‌ భారత్‌ క్లీన్‌ పథకం ఉద్యానవన పంటకు చేయూత
  • చిరుధాన్యాల పంటలకు సహకారం. ఇందుకోసం ‘శ్రీఅన్న’ పథకం. రాగులు, జొన్నలు, సజ్జలు తదితర పంటలకు ప్రోత్సాహం

 

 11.7కోట్లతో టాయ్‌లెట్స్‌ నిర్మాణం చేపట్టాం  


స్వచ్ఛ భారత్‌లో భాగంగా 11.7కోట్లతో టాయ్‌లెట్స్‌ నిర్మాణం చేపట్టామని నిర్మలా సీతారామన్ తెలిపారు.44కోట్ల మందికి పీఎం సురక్షా బీమా యోజన పథకం అందుతోందన్నారు.  ఉచిత ఆహార ధాన్యాల పథకానికి 2లక్షల కోట్లను కేంద్రం భరిస్తోందని తెలపారు, 

 

రైతు, పేద, మధ్యతరగతి వారి కోసం బడ్జెట్  

రైతు, పేద, మధ్యతరగతి వారి కోసం బడ్జెట్   రూపొందించామని నిర్మలా సీతారామరన్ తెలిపారు.  తొమ్మిదేండ్లలో అతిపెద్ద ఆర్థికశక్తిగా భారత్ ఎదిగామన్నారు.  తలసరి ఆదాయాన్ని డబుల్ చేశామన్నారు.  7శాతం వృద్ధి రేటును ఆర్థిక సర్వే అంచనా వేసిందన్నారు.  ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి ఎదిగామన్నారు. కోవిడ్ టైమ్ లో ఎవరూ ఆకలితో బాధపడలేదన్న సీతారామన్  ఉచిత ఆహారధాన్యాల పంపిణీ కొనసాగుతోందని చెప్పారు. 


పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. వరుసగా ఐదోసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ను  ప్రవేశపెట్టారు. ప్రపంచదేశాలే మన ఆర్థిక వ్యవస్థను ప్రశంసించాయని తెలిపారు. ప్రపంచంలోనే ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్ధగా భారత్ ఉందని తెలిపారు.  ప్రపంచం మొత్తం భారత్ వైపు  చూస్తోందని చెప్పారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు.  భారత్ నేడు తలెత్తుకొని నిలబడుతోందన్నారు. 102 కోట్లమందికి వ్యాక్సిన్ ను ఉచితంగా అందించామని చెప్పారు. 

బడ్జెట్‌ వేళ..నిర్మలమ్మ ధరించే చీరలకు ప్రత్యేకత 

చేనేత చీరలంటే నిర్మలమ్మకు ఎంతో ఇష్టం

ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఐదోసారి. ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున నిర్మలమ్మ ధరించే చీరలపైనా అందరి దృష్టి ఉంటుంది. ఈ రోజు బడ్జెట్ ట్యాబ్‌తో ఎరుపు రంగు చీరలో కనిపించారు. బ్రౌన్‌ రంగులో టెంపుల్‌ బోర్డర్‌లో ఉన్న ప్రకాశవంతమైన ఎరుపు చీరతో కనిపించారు.

2019లో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు తీసుకున్న దగ్గరి నుంచి ఈ రోజున చేనేత చీరే ధరిస్తున్నారు. వాటిపై తన ప్రేమను ఓ సందర్భంలో ప్రస్తావించారు కూడా. ‘సిల్క్‌, కాటన్ ఏదైనా కానీ.. ఒడిశా చేనేత చీరలు నాకిష్టమైన వాటిలో ఒకటి.  వాటి రంగు, నేతపని, ఆకృతి బాగుంటాయి’ అని చెప్పారు.

2022లో మెరూన్‌ రంగు చీరను ధరించారు. ఇది కూడా ఒడిశాకు చెందిన చేనేత చీరే. అలాగే 2021లో ఎరుపు-గోధుమ రంగుతో ఉన్న భూదాన్‌ పోచంపల్లి చీరలో కనిపించారు. తెలంగాణకు చెందిన ఈ పోచంపల్లిని సిల్క్‌ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. 2020లో నీలం రంగు అంచులో పసుపు పచ్చ-బంగారు కలర్ లో ఉన్న చీరలో కనిపించారు. ఈ రంగు శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తుంది. అలాగే ‘ఆస్పిరేషనల్‌ ఇండియా’ థీమ్‌కు అనుగుణంగా దీనిని ధరించారు. ఇక 2019లో మంగళగిరి గులాబీ రంగు చీర కట్టుకున్నారు. ఆ సమయంలో బడ్జెట్ పత్రాలు తెచ్చే సూట్‌కేస్‌ స్థానంలో బహీ ఖాతాతో మీడియా ముందుకు వచ్చారు.

బడ్జెట్ ట్యాబ్‌తో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బృందం పార్లమెంట్‌కు చేరుకుంది. ఉదయం 10 గంటలకు కేంద్ర కేబినెట్‌ సమావేశం కానుంది. ఈ భేటీలో కేంద్ర బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు. 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 

నిర్మలా సీతారామన్ కు.. ఐదో బడ్జెట్‌

ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఐదోసారి. ప్రస్తుత ప్రభుత్వానికి పూర్తిస్థాయి చివరి బడ్జెట్‌ ఇదే. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పుడు ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు.

కాసేపట్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఐదో సారి ఆర్ధిక మంత్రి హోదాలో  కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు రాష్ట్రపతిని ముర్మును నిర్మలా సీతారామన్ కలిశారు. బడ్జెట్ పై రాష్ట్రపతికి సమాచారం ఇచ్చారు. కాసేపట్లో నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు చేరుకుంటారు. మరోవైపు.. ఉదయం 10 గంటల30 నిమిషాలకు పార్లమెంటులో  మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఉదయం 11 గంటలకు లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్నారు. 

బడ్జెట్ పై సామాన్య, మధ్యతరగతి గంపెడాశలు

కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై సామాన్య, మధ్యతరగతి పౌరులు గంపెడాశలు పెట్టుకున్నారు. అందరికీ ఊరటనిచ్చేలా బడ్జెట్ ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పొరుగు దేశాలైన  శ్రీలంక, పాకిస్థాన్‌లను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారు. ఈసారి మధ్యతరగతి వాళ్లు మాత్రం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్త ఆర్థిక, సామాజిక పరిణామాల ప్రభావం భారత మధ్యతరగతివారిపైనా పడింది. 
 
తమకు ఊరటనిచ్చే ప్రకటనలేమైనా మోదీ ప్రభుత్వం చేస్తుందేమోనని ఆశిస్తున్నారు. ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులను సామాన్యులు ఆశిస్తున్నారు. కనీస మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలన్న డిమాండు గట్టిగా వినిపిస్తోంది. తయారీ, మౌలిక సదుపాయాల రంగాల్లో భారీగా ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యమిచ్చే అవకాశాలున్నాయి.