అబార్షన్ రూల్స్‌ మార్పు: చట్ట సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఓకే

అబార్షన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ – 1971ను సవరించబోతోంది. దీని కోసం రూపొందించిన చట్ట సవరణ బిల్లును బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. జనవరి 31 నుంచి మొదలయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని మోడీ సర్కార్ భావిస్తోంది.

మాతృ మరణాల నియంత్రణ కోసం ఈ చట్ట సవరణను తెస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు చట్టం ప్రకారం గర్భం దాల్చిన నాటి నుంచి 20 వారాల వరకు మాత్రమే అబార్షన్ చేయించుకునే అవకాశం ఉంది. అయితే ఈ గడువును 24 వారాలకు పెంచుతూ చట్ట సవరణ చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ప్రెగ్నెన్సీ విషయంలో తల్లి హక్కులను కాపాడేందుకు ఈ గడువు పెంచుతున్నట్లు తెలిపింది. మాతృ మరణాల రేటును తగ్గించడంతో పాటు అక్రమ అబార్షన్లను తగ్గించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని కేంద్ర కేబినెట్ అభిప్రాయపడింది.

Latest Updates