స్వైన్ ఫ్లూతో సెంటర్ షేక్

రాష్ట్రాలకు ప్రత్యేక బృందాల తరలింపు

రోజువారీగా వీడియో కాన్ఫరెన్స్

ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి వెల్లడి

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, వెలుగు : దేశంలో స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్య పెరిగిపోతుండడంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. పదకొండు రాష్ట్రా లకు ప్రత్యేక వైద్యాధికారులను పంపించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న స్వైన్ ఫ్లూ నివారణ చర్యల్లో వేగం పెంచేందుకు వీరు సాయపడతారని చెప్పింది. స్వైన్ ఫ్లూ మరణాలు ఎక్కువగా నమోదైన రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ లలో వ్యాధి తీవ్రతను, ఇతర పరిస్థితులను అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.

గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ చెప్పారు. దీంతోపాటు వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను అప్రమత్తం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించామన్నా రు. ఇన్ ఫ్లూ యెంజా వ్యాక్సినేషన్ కు సంబంధించి న గైడ్ లైన్స్​తో పాటు తయారీదారుల వివరాలను అన్ని రాష్ట్రాలకు పంపించినట్లు చెప్పారు. వ్యాధి నిరోధక చర్యల వివరాలనూ రాష్ట్రాలతో పంచుకున్నట్లు వివరించారు. ఈమేరకు గురువారం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో స్వైన్ ఫ్లూ పై పోరాటంలో రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలను సుడాన్ పరిశీలించారు.

పదకొండు రాష్ట్రాల్లో బాధితులు

ప్రధానంగా పదకొండు రాష్ట్రా ల్లో స్వైన్ ఫ్లూ బాధితులను గుర్తించినట్లు ప్రీతి చెప్పారు. రాజస్థా న్, గుజరాత్, పంజాబ్ లలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణలో ఇద్దరు చనిపోయారని చెప్పారు. స్వైన్ ఫ్లూ తో మరణించి న వారిలో ఎక్కువగా డయాబెటిస్, హైపర్ టెన్షన్ బాధితులే ఉన్నారని ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొం ది.  వ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా రోజువారీగా ఆయా రాష్ట్రా లతో వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించనున్నట్లు తెలిపింది. ఐడీఎస్ పీ, ఐసీఎంఆర్ ఆధ్వర్యం లోని 53 లేబరేటరీలలో వ్యాధి నిర్ధా రణ పరీక్షలు జరుగుతున్నాయని పేర్కొం ది. చికిత్సలో ఉపయోగించే ఒసెల్టామివిర్ మందును ప్రజారోగ్య వ్యవస్థ ద్వారా ఉచితంగా పంపి ణీ చేస్తున్నట్లు తెలిపింది. వారంలో 1176 మంది జనవరి 28 నుంచి ఫిబ్రవరి 3 మధ్య వారం వ్యవధిలో ఈ 4 రాష్ట్రా ల్లో 2101 మందిని పరీక్షించగా.. 1176 మంది స్వైన్ ఫ్లూ బారిన పడ్డా రని తేలిం ది.

బాధితుల్లో మరణాల రేటు 1%

స్వైన్ ఫ్లూ బాధితుల్లో మరణాల రేటు ఒక్క శాతమేనని, ప్రపంచవ్యా ప్తంగా చూస్తే ఇండియాలో మరణాలరేటు తక్కువేనని నిపుణులు చెబుతున్నా రు. సమయానికి తగిన చికిత్స అందకపోవడం, బాధితు ల రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్లే మరణాలు చోటుచేసుకుంటున్నా యని వివరించారు.

జాగ్రత్తగా ఉండాలె

వాతావరణం చల్లగా ఉంటే, స్వైన్ ఫ్లూ వైరస్ ఎక్కువ సేపు బతికి ఉంటుం ది. ఒకరి నుంచి మరొకరికి వ్యా పించే అవకాశాలు ఎక్కువ. కాబట్టి బయటకు వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వైరస్ ను అడ్డుకునే మాస్క్ లను

ముఖానికి పెట్టుకుం టే కొంతవరకు దీన్ని నివారించవచ్చు. జ్వరం రావడంతోపాటు గొంతు నొప్పి , ఒళ్లునొప్పులు, దగ్గు కూడా ఉంటే వెంటనే డాక్టర్ ను కలవాలి. – డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌, కరీం నగర్‌‌స్వైన్

 

Latest Updates