క‌రోనా నుంచి కోలుకున్న బాధితులకు గైడ్స్ లైన్స్ జారీ చేసిన కేంద్రం

క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న బా,ధితుల‌కు కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప‌లు సూచ‌న‌లిచ్చింది.

క‌రోనా నుంచి కోలుకున్న వారిలో కొన్ని రోజుల వ‌ర‌కు అల‌స‌ట‌, బాడీ పెయిన్స్, ద‌గ్గు, గొంతునొప్పి, బ్రీతింగ్ స‌మ‌స్య‌లు త‌లెత్తున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై దృష్టిసారించిన కేంద్రం..డాక్ట‌ర్లు, ఆయుర్వేద నిపుణుల సూచ‌న‌ల మేర‌కు కొన్ని గైడ్ లైన్స్ జారీ చేసింది.

ఈ గైడ్స్ లైన్స్ క‌రోనా వైర‌స్ త‌గ్గేందుకు కాద‌ని, క‌రోనా త‌గ్గిన త‌రువాత త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు ఈ సూచ‌న‌లిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

క‌రోనా నుంచి కోలుకున్న‌వారికి జారీ చేసిన గైడ్ లైన్స్ ఇలా ఉన్నాయి.

  • క‌రోనా త‌గ్గిన త‌రువాత మాస్క్ లు ధ‌రించ‌డం, బౌతిక దూరాన్ని పాటించ‌డం, చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవ‌డం, ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాన్ని తీసుకోవాలి.
  • ఆయుర్వేద నిపుణుల స‌ల‌హా మేర‌కు ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ను పెంచే ఆయుర్వేద ఔష‌దాలైన ములేతి ఫౌడ‌ర్, అశ్వ‌గంధ‌, ఉసిరిక‌, చ్యవన్‌‌ ‌‌ప్రాష్‌, ప‌సుపు పాలుతాగాలి.
  • తగినంత వేడి నీళ్లు తాగాలి.
  • నిపుణుల సూచ‌న‌ల‌తో యోగాసనా, ప్రాణాయామం మరియు ధ్యానం చేయ‌డం.
  •  నిపుణుల సూచ‌న‌ల‌తో బ్రీతింగ్ ఎక్స‌ర్ సైజ్, రోజువారీ ఉదయం లేదా సాయంత్రం నడక
  • శ‌రీరంలో వేడి , రక్తపోటు, రక్తంలో చక్కెర (ముఖ్యంగా, డయాబెటిస్ ఉంటే) వైద్యుల స‌ల‌హా మేర‌కు ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. లేదంటే ఆస్ప‌త్రిలో జాయిన్ అవ్వాల‌ని కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ తెలిపింది. 

Latest Updates