విధుల్లో చేరిన RTC యూనియన్ లీడర్లు

కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన కార్మిక సంఘాలకు ప్రత్యేక సౌకర్యాలు కట్ చేయడంతో కార్మిక నాయకులు విధుల్లో చేరుతున్నారు. టీఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్ రెడ్డి… కరీంనగర్ బస్టాండ్ లో ట్రాఫిక్ డిప్యూటీ సూపరింటెండెంట్ గా డ్యూటీలో చేరారు. చాలా రోజుల తర్వాత సీట్లో కూర్చొని, తోటి ఉద్యోగులతో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు థామస్ రెడ్డి. ఎప్పటిలాగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూనే, సంస్థ కోసం అంకిత భావంతో పనిచేస్తానన్నారు. ప్రభుత్వం వెల్ఫేర్ కమిటీలను నియమించినా, ట్రేడ్ యూనియన్లు రద్దు కావని తెలిపారు  థామస్ రెడ్డి.

యూనియన్లు ఉంటేనా ఉద్యోగులకు రక్షణ ఉంటుందని తెలిపారు. లేకుంటే చిన్న యాక్సిడెంట్ అయినా  డ్రైవర్లను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. తాము విధులు నిర్వహిస్తూనే కార్మికులకు అండగా ఉంటామని తెలిపారు. యూనియన్లు అనేది ఆనవాయితీగా వస్తుందని చెప్పారు టీఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్ రెడ్డి.

Latest Updates