సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న కేంద్ర మంత్రి

సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా.  ప్రత్యేక హెలికాప్టర్ లో  మేడారం చేరుకున్న అర్జున్ ముండాకు…. రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతిరాథోడ్, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఘన స్వాగతం పలికారు. గద్దెల దగ్గరకు చేరుకున్న అర్జున్ ముండా సమ్మక్క, సారలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు, వన దేవతలకు సారెతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించారు. కేంద్ర మంత్రితో  పాటు.. మంత్రులు, సీఎస్ సోమేష్ కుమార్..DGP మహేందర్ రెడ్డి అమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

వన దేవతలను దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు కేంద్ర మంత్రి అర్జున్ ముండా. మేడారం జాతీయ పండగ అంశంను ప్రధాని దృష్టికి తీసుకెళ్తామన్నారు. త్వరలోనే గిరిజన ఆదివాసుల ఆకాంక్ష నెరవేరుతుందన్నారు కేంద్ర మంత్రి. గిరుజనుల దగ్గర ఆస్తులు లేకున్నా.. ఆనందం ఉందన్నారు.

Latest Updates