అమృత్‌‌‌‌‌‌‌‌ స్కీం కింద ఉమ్మడి జిల్లాకు రూ.852కోట్లు : బండి సంజయ్‌‌‌‌‌‌‌‌

అమృత్‌‌‌‌‌‌‌‌ స్కీం కింద ఉమ్మడి జిల్లాకు రూ.852కోట్లు : బండి సంజయ్‌‌‌‌‌‌‌‌

చొప్పదండి, వెలుగు: దేశంలో ఇంటింటికి తాగునీరు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం అమృత్‌‌‌‌‌‌‌‌ పథకాన్ని అమలుచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ అన్నారు. సోమవారం చొప్పదండిలోని శనగకుంట నల్లాలబావి వద్ద రూ.36.3 కోట్లతో వాటర్ ఇంప్రూవ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పథకానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి భూమిపూజ చేశారు.  ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ స్కీం ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అమృత్ 1, 2 కింద మొత్తం రూ.852.11 కోట్లు కేటాయించామని, అందులో కేంద్రం వాటా రూ.481.19 కోట్లు కాగా.. రాష్ట్రం వాటా రూ.297.55 కోట్లు, మున్సిపాలిటీల వాటా రూ.73.37 కోట్లుగా పేర్కొన్నారు. 

అమృత్ 2 పథకం కింద చొప్పదండి మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికి సరిపడా నీళ్లను అందించాలనే లక్ష్యంతో రూ.36.30 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.  గతంలోనే ఇక్కడ అమృత్​ స్కీంను స్టార్ట్ చేయాల్సి ఉండగా బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే ల్యాండ్‌‌‌‌‌‌‌‌ కేటాయింపు జరగలేదన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో చొప్పదండి పట్టణ ప్రజలకు ఇంటింటికీ నీటిని సరఫరా చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్​ కొత్తూరు మహేశ్‌‌‌‌‌‌‌‌, డీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​పద్మాకర్​రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్​రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగయ్యగౌడ్​, సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్​, మున్సిపల్​ కమిషనర్​ నాగరాజు పాల్గొన్నారు.