కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు క‌‌రోనా పాజిటివ్

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని మంగళవారం సాయంత్రం స్వయంగా ఆయనే ట్విటర్ ద్వారా వెల్లడించారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలడంతో చికిత్స నిమిత్తం గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుతం కేంద్రంలో పెట్రోలియం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇటీవల ధర్మేంద్ర ప్రధాన్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చిది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా ఆయన క్వారంటైన్‌లో ఉంటున్నారు. గత బుధవారం జరిగిన కేబినెట్ సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. ఐతే రెండు రోజులుగా కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టుల్లో కరోనా పాజిటివ్‌గా తేలడంతో వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరారు. కాగా, ఆదివారం కేంద్రహోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. ఆయన కూడా మేదాంత ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

 

Latest Updates