తప్పని నిరూపిస్తే నగ్న ప్రదర్శన చేస్తా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ కి సవాల్ విసిరారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. పన్నుల రూపంలో కేంద్రానికి రాష్ట్రం ఏటా 2లక్షాల 75వేల కోట్లు చెల్లిస్తుందని.. కేంద్రం మాత్రం తిరిగి లక్షా 45 వేల కోట్లు మాత్రమే చెల్లిస్తుందన్నారు. మరో లక్షా 30 వేల కోట్లు రాష్ట్రానికి ఇవ్వకుండా దగా చేస్తోందని ఆరోపించారు. తన ఆరోపణల్ని తప్పని బండి సంజయ్, కిషన్ రెడ్డి నిరూపిస్తే.. జనగామ నియోజకవర్గంలో అన్ని అంబేద్కర్ విగ్రహాల దగ్గర నగ్నంగా ప్రదర్శన చేస్తానన్నారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో జూబ్లీగార్డెన్ లో SCకార్పొరేషన్ ఆధ్వర్యంలో మినీ డైరీ రైతుల అవగాహన, శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు రుణ పత్రాలను అందజేశారు.

Latest Updates