ఢిల్లీలో పథకం ప్రకారమే హింసకు పాల్పడుతున్నరు

ఢిల్లీలో పథకం ప్రకారం హింసకు పాల్పడుతున్నారన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన..  దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు సీఏఏతో ఎలాంటి నష్టం లేదని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు మత విద్వేషాలతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని…..తప్పుడు ప్రచారాన్ని, మాటలను నమ్మొద్దని కోరారు. మేడీ దేశ ప్రతిష్టను పెంచే ప్రయత్నం చేస్తుంటే.. ట్రంప్ వచ్చిన టైంలో ఆందోళనలు చేయడం ఏంటని ప్రశ్నించారు. హింసకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండు నెలల నుంచి దర్నాలు చేస్తున్నా కేంద్రం సానుకూలవైఖరిని ప్రదర్శించిందని చెప్పారు. ఇకపై ఎవరినీ ఉపేక్షించేదిలేదని తెలిపారు.

Latest Updates