రాష్ట్రంలో పండిన కందులను కేంద్రమే కొంటది

ఈ ఏడాది రాష్ట్రంలో పండిన కందులను కేంద్రమే కొనుగోలు చేసిందన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. రైతుల సమస్యలు, గిట్టుబాటు ధరలపై హైదరాబాద్ లో సీసీఐ, నాఫెడ్, మార్క్ ఫెడ్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. కందుల దిగుబడిని రాష్ట్ర ప్రభుత్వం సరిగా అంచనా వేయలేకపోయిందన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రం అడగ్గానే అదనంగా కూడా కందులను కేంద్రం కొనుగోలు చేసిందని వివరించారు. పత్తిని కూడా కేంద్రమే కొనుగోలు చేసిందని తెలిపారు.

Latest Updates