లైంగిక వేధింపులుపై కఠినమైన చట్టాలు: కిషన్ రెడ్డి

రేప్, లైంగిక వేధింపులుపై కఠినమైన చట్టాలు ప్రవేశ పెట్టబోతున్నామని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఫోక్స్ చట్టం లో సవరణ లు చేయబోతున్నామని చెప్పారు. కేంద్ర హోమ్ మంత్రి అయ్యాక డిపార్ట్మెంట్ గురించి నిత్యం నేర్చుకుంటున్నట్లు చెప్పారు.

అసెంబ్లీలో ఎంఐఎం ను పక్కన పెట్టుకుని టీఆర్ఎస్ మతం గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందనడం సరికాదన్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని వెనక్కి పంపిస్తామన్నారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ బలపడుతుందన్నారు కిషన్ రెడ్డి.

Latest Updates