3 నెలల జీతాన్ని భైంసా బాధితులకు ఇచ్చిన కేంద్ర మంత్రి

భైంసా బాధితులకు అండగా ఉంటామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆదివారం బైంసాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. బైంసాలో ఓ వర్గం ప్రజలపై జరిగిన దాడిని ఖండించారు. బాధితులకు న్యాయం చేస్తామన్నారు. తన 3 నెలల జీతాన్ని భైంసా బాధితులకు విరాళంగా ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర నేతలతో కలిసి భైంసాలో పర్యటించారు కిషన్ రెడ్డి.

అల్లర్లు జరిగిన కొర్బా గల్లీని పరిశీలించిన కిషన్ రెడ్డి బాధితులతో మాట్లాడారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.అల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కేంద్రమంత్రిగా 3నెలల జీతాన్ని భైంసా బాధితులకు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. కిషన్ రెడ్డి పర్యటన సందర్భంగా పట్టణంలో సెక్యూరిటీ పెంచారు పోలీసులు.

భైంసా అల్లర్లపై కేంద్రానికి నివేదిక ఇస్తామన్నారు బీజేపీ రాష్ట్ర చీఫ్ లక్ష్మణ్. ఈ ఘటనపై అవసరమైతే సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తామని చెప్పారు. అల్లర్లు మజ్లిస్ కుట్రేనని అన్నారు లక్ష్మణ్. మజ్లిస్ కు టీఆర్ఎస్ వత్తాసు పలుకుతుందని ఆరోపించారు. బాధితులను కొత్త ఇళ్లు కట్టివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఘటన జరిగి ఇన్ని రోజులైన కేసీఆర్, కేటీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు ఎంపీ అర్వింద్. కేసీఆర్ కు ఎన్నికలప్పుడే హిందువులు గుర్తోస్తాని విమర్శించారు. జిల్లా యంత్రాంగం మీద పూర్తిగా నమ్మకం పోయిందన్నారు అర్వింద్.

వందల మంది వ్యక్తులు తమపై రాల్లు, పెట్రోలుతో దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారుబాధితులు. కట్టుబట్టలు కూడ మంటల్లో కాలిపోయాయన్నారు. అనుక్షణం భయంతో బతుకుతున్నామన్నారు. కిషన్ రెడ్డితో పాటు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు.. స్థానిక నేతలు ఉన్నారు.

Latest Updates